మందు బాటిల్ కొట్టేద్దామని ప్లాన్.. కానీ  ఇలా దొరికేశాడు..

మందు బాటిల్ కొట్టేద్దామని ప్లాన్.. కానీ  ఇలా దొరికేశాడు..

ఇప్పటి వరకు ఎన్నో రకాల దొంగతనాల గురించి విని ఉంటారు. తెలివివిూరిపోయిన దొంగలు పోలీసులకు చిక్కకుండా తమ చేతి వాటం ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖాని మాస్కులు వేసుకోవటం, ఫింగర్‌ ఫ్రింట్స్‌ దొరక్కుండా జాగ్రత్తపడటం చేస్తుంటారు. డాగ్‌ స్కాడ్‌ తెప్పించినా.. కుక్కలు వాసన పసిగట్టకుండా కారం పొడి లాంటివి చల్లటం గురించిన వార్తలను మనం చూసే ఉంటాం.  కాని ఇప్పుడు చెప్పడోయే దొంగతనం మద్యం షాపులో జరిగింది.  మద్యం బాటిల్ ను తీసుకొని డోర్ వద్దకు రాగా .. అది తెరచుకోకపోవడంతో చేసేదేమీ లేక కేష్ కౌంటర్ దగ్గర టేబుల్ పై విసిరేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

రోజు రోజుకు దొంగలు తెలివి మీరి పోతున్నారు.  గతంలో తాళం వేసిన ఇళ్లలోనో...షాపుల్లోనో దొంగతనం చేసేవారు. ఇప్పుడు ఓ మందుబాబు .. దొరబాబు మాదిరిగా లిక్కర్ షాపులోకి వెళ్లి ఓ మద్యం బాటిల్ ను తీసుకొని కేష్ కౌంటర్ దగ్గరకు వెళుతున్నట్లు నటించి.. అక్కడున్న మహిళా ఉద్యోగి ఆదమరిచి ఉన్నదనుకొని .. స్పీడుగా పరిగెత్తుకుంటూ డోర్ వద్దకు వెళ్లాడు.  ఈ తతంగాన్ని ఆ ఉద్యోగి పరిశీలించిన విషయం పాపం ఆ దొంగ దొరగారికి తెలియదు.  ఇక అంతే  ఆ మహిళా ఉద్యోగి డోర్ లాక్ చేసింది.  ఎంత సేపటికి డోర్ ఓపెన్ కాకపోవడంతో తిరిగి వచ్చి ఆ బాటిల్ ను ఆమె టేబుల్ పై విసిరేసి వెళ్లాడు.  ఇదంతా అక్కడున్న సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఈ ఘటన జూన్ 6న  ఆస్ట్రేలియాలోని ది బాటిల్- ఓ బీచ్‌బోరో మద్యం దుకాణంలో చోరీ చేయబోయి దొరికాడు.  దొంగ  విఫల ప్రయత్నం సీసీ  ఫుటేజీ స్టోర్  ఫేస్‌బుక్ పేజీలో  ఫోస్ట్ చేయగా అది వైరల్ అయింది.  

 షాప్ అసిస్టెంట్ మెయిన్ గేట్ తెరవడానికి ముందు పెట్టెను సేకరిస్తున్నప్పుడు అతను తలుపు వైపు వెళ్లాడు. "ఈ వ్యక్తి ఎవరో తెలుసా," స్టోర్ పేజీ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోను చూసిన  చాలా మందికి నవ్వుకున్నారు.  ఆ   దొంగ  క్రిమినల్ మాస్టర్‌ మైండ్  అనే వ్యంగ్య బిరుదును సంపాదించాడు. ఆన్‌లైన్ వీక్షకుల నుండి వచ్చిన రిబ్ -ట్రిక్లింగ్ ప్రతిస్పందనలతో వీడియోను లైక్ చేశారు.  . ఒక వినియోగదారు డు  “ఇది గొప్పది! ఎంతటి పురాణ విఫలం. ”  అని పోస్ట్ చేయగా మరొకరు  "అతనికి ఎంత ఇబ్బందిగా ఉంది, ఆమె 'సార్ దయచేసి పానీయాలు కింద పెట్టండి, మీరు వాటిని కింద పెట్టే వరకు మీరు బయటకు రాలేరు' అని రాశారు."

ఈ వీడియోలో  షాప్ అసిస్టెంట్ భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్లు కనిపించింది. ఒక వినియోగదారు ఇలా అన్నారు, “అది షాప్ అసిస్టెంట్ యొక్క తెలివైన విషయం కాదు. హనీ, మీరు దొంగతో షాప్‌లో (ఒంటరిగా ఉన్నట్లు) తాళం వేయడానికి తగినంత డబ్బును పొందలేరు. మీ భద్రతకు ఏదీ విలువైనది కాదు, అతను కెమెరాలో ఉన్నాడు, అతన్ని వెళ్లనివ్వండి. మరొకరు అంగీకరించారు, “ఎంత ప్రమాదకరమైనది, అతను హింసాత్మకంగా మారితే..  అప్పుడు ఆమె  భయంకరమైన పరిస్థితిలో ఉండేది. ఇప్పటి వరకు ఈ ఫేస్‌బుక్‌ వీడియోను  22 వేల మందికి పైగా చూశారు.