OTT Releases: ఈ వారం సినీ ప్రియులకు పండుగే పండుగ.. థియేటర్లలో, ఓటీటీలలో సందడి చేసే మూవీస్, సిరీస్‌లు ఇవే!

OTT Releases: ఈ వారం సినీ ప్రియులకు పండుగే పండుగ..  థియేటర్లలో, ఓటీటీలలో సందడి చేసే  మూవీస్, సిరీస్‌లు ఇవే!

ఈ వారం సినిమా ప్రియులకు పండుగే పండుగ. థియేటర్లు, ఓటీటీలలో కొత్త సినిమాల జాతర మొదలైంది. ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల జాబితా ఆసక్తికరంగా ఉంది. ఈ వారం థియేటర్లలో తెలుగు సినిమాలు 'బకాసుర రెస్టారెంట్', 'రాజుగాని సవాల్', 'భళారే సిత్రం' విడుదలవుతుండగా, కన్నడ బ్లాక్‌బస్టర్ 'సూ ఫ్రమ్ సూ' కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

ఓటీటీలలో తెలుగు కంటెంట్ సందడి
ఈ వారం ఓటీటీలో ప్రత్యేకించి తెలుగు ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందుబాటులోకి రానుంది. 'అరేబియా కడలి' (అమెజాన్ ప్రైమ్), 'మోతెవరి లవ్ స్టోరీ' (జీ5), తెలుగు పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్ 'మయసభ' (సోనీ లివ్)  వంటి తెలుగు వెబ్ సిరీస్‌లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వీటితో పాటు తమిళం నుంచి 'ఓ ఎంథన్ బేబీ' (నెట్‌ఫ్లిక్స్), 'పరందు పో' (హాట్‌స్టార్), మలయాళం నుంచి 'నడికర్' (సైనా ప్లే) వంటి డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఈ వారంలోనే కిరీటి రెడ్డి , శ్రీలీల నటించిన 'జూనియర్'  సినిమా కూడా ఓటీటీలోకి రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ వారం ఓటీటీలో స్టీమింగ్ అయ్యే మూవీస్, సిరీస్ చూద్దాం.. 


నెట్‌ఫ్లిక్స్:
ఎస్ఈసీ ఫుట్‌బాల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05
టైటాన్స్: ద రైజ్ ఆఫ్ హాలీవుడ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05
వెన్స్ డే సీజన్ 2 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 06
ఓ ఎంథన్ బేబీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 08
స్టోలెన్: హీస్ట్ ఆఫ్ ద సెంచరీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 08
మ్యారీ మీ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 10

హాట్‌స్టార్:
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫుడీ (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 04
పరందు పో (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 05
లవ్ హర్ట్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 07
మిక్కీ 17 (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 07
సలకార్ (హిందీ సిరీస్) - ఆగస్టు 08

జీ5:
మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు సిరీస్) - ఆగస్టు 08
మామన్ (తమిళ మూవీ) - ఆగస్టు 08
జరన్ (మరాఠీ సినిమా) - ఆగస్టు 08

సోనీ లివ్:
మయసభ (తెలుగు సిరీస్) - ఆగస్టు 07

అమెజాన్ ప్రైమ్:
అరేబియా కడలి (తెలుగు సిరీస్) - ఆగస్టు 08

 

సన్ నెక్స్ట్:
హెబ్బులి కట్ (కన్నడ సినిమా) - ఆగస్టు 08

ఆపిల్ ప్లస్ టీవీ:
ప్లాటోనిక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 06

ఎమ్ఎక్స్ ప్లేయర్:
బిండియే కే బాహుబలి (హిందీ సిరీస్) - ఆగస్టు 08

సైనా ప్లే:
నడికర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 08

లయన్స్ గేట్ ప్లే:
ప్రెట్టీ థింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 08
బ్లాక్ మాఫియా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08

మొత్తంగా ఈ వారం విడుదలవుతున్న థియేటర్, ఓటీటీ సినిమాల జాబితా చూస్తే వినోదానికి లోటు ఉండదని స్పష్టంగా తెలుస్తోంది.