లోకల్ ప్రాడక్ట్స్‌‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి

లోకల్ ప్రాడక్ట్స్‌‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని మోడీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయ దశమి సందర్భంగా ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదాన్ని ప్రజలకు ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా పండుగ షాపింగ్‌‌లో లోకల్ వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలని నెలవారీ రేడియో ప్రోగ్రామ్ అయిన మన్ కీ బాత్‌‌లో మోడీ కోరారు. కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న విషమ పరిస్థితులను అధిగమించడానికి ఓపికంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు సురక్షితంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు.

‘పండుగలను సెలబ్రేట్ చేసుకోవాలనే విషయం ఆలోచించినప్పుడు ముందుగా మార్కెట్‌‌కు వెళ్తాం. ఈసారి మీరు మార్కెట్‌‌కు వెళ్లినప్పుడు.. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని గుర్తు చేసుకోండి. మార్కెట్‌‌లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో స్థానిక వస్తువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వండి. ఈ ఏడాది గాంధీ జయంతి సమయంలో ఢిల్లీలోని కొన్నాట్ ప్రాంతంలోని ఖాదీ స్టోర్‌‌లో ప్రజలు రూ.1 కోటి విలువైన షాపింగ్ చేశారు. కరో్నా టైమ్‌‌లో ఖాదీ మాస్క్‌‌లు బాగా పాపులర్ అయ్యాయి. దీని వల్ల ఖద్దరు పాపులారిటీ పెరగడంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు ఖద్దరు విస్తరించేందుకు అవకాశాలు పెరుగుతాయి. అలాంటి ఓ చోటే మెక్సికోలోని ఓక్సాకా. ఇక్కడి స్థానిక గ్రామస్థులు ఖాదీని నేస్తారు. ఇండియా వోకల్ ఫర్ లోకల్‌‌గా మారితే మొత్తం ప్రపంచం మన స్థానిక ఉత్పత్తులకు అభిమానిగా మారుతుంది’ అని మోడీ పేర్కొన్నారు.