భారతీయ మహిళ ఐడెంటిటీతో బార్బీ బొమ్మ

భారతీయ మహిళ ఐడెంటిటీతో బార్బీ బొమ్మ

బార్బీ బొమ్మని ఇష్టపడని పిల్లలు ఉండరు. అందుకని వాళ్ల  ఆటవస్తువుల్లో ఈ బొమ్మ తప్పనిసరిగా ఉంటుంది. అయితే, ఇప్పటివరకూ విదేశాల్లోని పిల్లలు, ఆడవాళ్లను పోలిన బార్బీబొమ్మలనే చూశాం.  అయితే ఈ ఏడాది మాత్రం మనదేశ మహిళల్ని తలపించేలా బార్బీ బొమ్మని తయారుచేసింది మ్యాటిల్ కంపెనీ. ఇండియన్ బార్బీ బొమ్మ తయారీకి స్ఫూర్తి ఎవరంటే... యూట్యూబర్, బ్యూటీ ఎంట్రప్రెనూర్ ప్రియాంక ముత్యాల. తనొక ఇండియన్ అమెరికన్. 

బ్యూటీ ప్రొడక్ట్స్​ ద్వారా బ్రౌన్​కలర్ మేకప్​ని (భారతీయుల చర్మం రంగుని) ప్రమోట్ చేయాలనేది ప్రియాంక డ్రీమ్​. అందుకనే  బ్యూటీ ఎంట్రప్రెనూర్​గా మారి, ‘లైవ్​ టింటెడ్’ అనే కంపెనీ పెట్టింది. ఆమె ఆలోచన బార్బీ బొమ్మల్ని తయారుచేసే మ్యాటిల్ కంపెనీకి బాగా నచ్చింది. దాంతో ఈ ఏడాది ఇండియన్ బార్బీ బొమ్మ తయారుచేయాలనుకుంది. ప్రియాంకతో కలిసి ఇండియన్​ బార్బీ బొమ్మ డిజైన్​ ప్లాన్​ చేసింది. ఎరుపు రంగు ప్యాంట్ సూట్​, గులాబీ రంగు టీ–షర్ట్​,  చేతులకి గాజులు, చెవులకి కమ్మలు, పెదవులకు లిప్​స్టిక్ రాసుకుంటున్న బార్బీ బొమ్మలు సోషల్​మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

భారతీయ మహిళ ఐడెంటిటీ

‘‘ఈ ఏడాది బార్బీ బొమ్మను చూడండి. ఆమె చర్మం  బ్రౌన్​ కలర్​లో ఉంది​. ఆమె కళ్లు, కనుబొమలు పెద్దగా ఉన్నాయి. చెవులకి  కమ్మలు, చేతులకు గాజులు పెట్టుకుని, సూట్ వేసుకొని కాన్ఫిడెంట్​గా ఉంది. భారతీయ మహిళగా అది ఆమె ఐడెంటిటీ. తను సంప్రదాయ కట్టుబాట్లని బద్దలు కొడుతుంది. పెద్ద కలలు కంటుంది. అంతేకాదు అందరితో ప్రేమ, దయతో ఉంటుంది. ప్రపంచంపై తన ముద్ర వేయాలనే గట్టి పట్టుదల ఉంది తనలో. ఆమె ఒక కంపెనీ సీఇవో. తనే కొత్త బార్బీ బొమ్మ” అంటూ  పోస్ట్ కింద రాసింది ప్రియాంక. 

యూట్యూబ్​ వీడియోతో...

టీనేజ్​లో ఉన్నప్పటి నుంచే ప్రియాంకకు మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని ఉండేది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పింది.  ‘నేను సొంతంగా మేకప్ బ్రాండ్ పెడతాను. అది కూడా మనలాగ ఛామనచాయలో ఉండేవాళ్ల
కోసం’ అని.‘హౌ టు కవర్ డార్క్​ అండర్​ ఐ సర్కిల్స్’ అనే వీడియోని 2015లో యూట్యూబ్​లో పెట్టింది ప్రియాంక. ఆ వీడియో చాలామందికి నచ్చింది. అప్పటినుంచి బ్రౌన్ బ్యూటీ ఇన్​ఫ్లుయెన్సర్​గా పేరు తెచ్చుకుంది.