తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శనం చేసుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవురోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్గడ్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి జంపన్న వాగులో పుణ్య స్థానాలు ఆచరించారు.
ఒడ్డుపై ఉన్న జంపన్న, నాగులమ్మ, గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్ కు ముడుపులు కట్టారు. అనంతరం అమ్మవారి గద్దెల ప్రాంగణానికి వచ్చి ఎత్తు బెల్లం, కొబ్బరికాయలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, ఒడిబియ్యం దేవతలకు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎండోమెంట్ అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పించారు.
