శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద  10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

శ్రీశైలం, వెలుగు: శని, ఆదివారాలు సెలవులు రావడంతో.. శ్రీశైలానికి యాత్రికులు క్యూ కట్టారు. దీనికితోడు నాలుగు రోజులుగా ఇక్కడి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ అందాలను చూసేందుకు పర్యాటకులు వేలాదిగా తరలిస్తున్నారు. హైదరాబాద్​ వైపు నుంచి భారీగా వాహనాలు రావడంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది.

 దోమలపెంట నుంచి సున్నిపెంట వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనాలు నిదానంగా కదులుతుండడంతో బస్సుల్లో వచ్చిన ప్రయాణికులు తిప్పలు పడ్డారు. శ్రీశైలం పోలీసులు ట్రాఫిక్​ను క్లియర్  చేశారు.