హాష్ ఆయిల్ అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్

హాష్ ఆయిల్ అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్

 జీడిమెట్ల, వెలుగు :  హాష్ ఆయిల్ అమ్ముతున్న ముగ్గురిని హైదరాబాద్ లోని బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాపూర్ నగర్ లోని డీసీపీ ఆఫీసులో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు, ఏసీపీ గంగారాం కేసు వివరాలను వెల్లడించారు. మూసాపేటకు చెందిన అంపిలి బాలరాజు(29), బోయిన్ పల్లిలోని గంగపుత్ర కాలనీకి చెందిన మాడుగుల సతీశ్(24), గురుద్వారకి చెందిన బేగరి నరేశ్(28) .. జల్సాల కోసం హాష్ ఆయిల్ అమ్మడం మొదలుపెట్టారు. పలుసార్లు జైలుకెళ్లి వచ్చినా వీరి తీరు మారలేదు.

స్టూడెంట్లను టార్గెట్ గా చేసుకొని హాష్​ ఆయిల్ ను అమ్మేవారు. బూడిద విశ్వనాథం అనే వ్యక్తి ద్వారా వైజాగ్ కు చెందిన హాష్ ​ఆయిల్ సప్లయర్ నాగార్జున నుంచి ఈ ముగ్గురు సరుకు కొని సిటీకి తెచ్చేవారు. దాన్ని బాలరాజు ఇంట్లో దాచేవారు. ఆ తర్వాత సతీశ్, నగేశ్​ హాష్ ఆయిల్ ను తమ ఇండ్లకు తీసుకెళ్లి స్థానిక ఏరియాల్లో అమ్మేవారు. మంగళవారం ఫతేనగర్ బ్రిడ్జి వద్ద హ్యాష్​ఆయిల్ అమ్ముతుండగా బాలానగర్ ఎస్ వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరు ఇచ్చిన సమాచారంతో బాలరాజును సైతం అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురి నుంచి రూ.12 లక్షల విలువైన 900 ఎం.ఎంల్ హాష్​ ఆయిల్, రూ.1,200 క్యాష్, 3 సెల్ ఫోన్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించామన్నారు. సప్లయర్ నాగార్జున పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.