అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు మృతి

V6 Velugu Posted on Jun 22, 2021

కృష్ణా జిల్లా ఈదర సగరలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఇవాళ స్థానిక చెరువులో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన చిన్నారులు శశిక(11), చంద్రిక(9), జగదీశ్(8) గా గుర్తించారు.  మృతదేహాలను నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు చిన్నారులు సోమవారం బయటకు వెళ్లారు. రోజంతా గడిచిన తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. నూజివీడు, విజయవాడ పరిసరాల్లో పోలీసులు వెతికారు రాత్రైనా పిల్లల ఆచూకి తెలియలేదు. ఇవాళ చెరువులో చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

Tagged Died, krishna, missing, Three Children, fallen, pond

Latest Videos

Subscribe Now

More News