
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: కాంగ్రెస్సీనియర్నేత నీలం మధును సోమవారం కామారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కలిశారు. ఈ సందర్భంగా మహేశ్, శేఖర్, కరుణాకర్, నాగరాజు తదితర యువజన నాయకులు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్న మధుతో తామంతా నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
33 జిల్లాలోని 119 నియోజకవర్గాల్లో నీలం మధు యువసేన, సోషల్ మీడియా టీంలు కమిటీలుగా ఏర్పడి ఆయన బాటలోనే నడుస్తున్నాయని తెలిపారు. అనంతరం మధు మాట్లాడుతూ సంక్షేమ పాలనను కొనసాగిస్తున్న కాంగ్రెస్కు అండగా యువత నిలవాలని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనకు అండగా నిలిచిన యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రంజిత్, అశోక్ పాల్గొన్నారు.