రాయ్‌పూర్‌లో కుప్పకూలిన భవనం: ముగ్గురు మృతి

రాయ్‌పూర్‌లో కుప్పకూలిన భవనం: ముగ్గురు మృతి

చత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఖాన్ తారై ప్రాంతంలో నాలుగంతస్తుల బిల్డింగ్ శుక్ర‌వారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. అందరు చూస్తుండగానే బిల్డింగ్ నేలమట్టమైంది. హఠాత్తుగా బిల్డింగ్ కుప్పకూలడంతో చుట్టుపక్కలవారు భయంతో పరుగులు తీశారు. సమాచారమందుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు ప్రయత్నాలు చేపట్టారు.