
- రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఘటన
జ్యోతినగర్, వెలుగు : ఇంట్లోకి కరెంట్సరఫరా కోసం యత్నిస్తుండగా ముగ్గురు గాయపడ్డారు. రామగుండం కార్పొరేషన్పరిధి ఎన్టీపీసీ క్రషర్ నగర్ కు చెందిన ఓ మహిళ తన ఇంట్లో కరెంట్సరఫరా కాకపోవడంతో శుక్రవారం సాయంత్రం ఇక్కింట్లో ఉండే గణేశ్(18 ), శివకేశవ(16), నరేశ్(13)ను పిలిచింది. వారు వచ్చి కర్రతో పైనున్న విద్యుత్ వైరు తగిలిస్తుండగా 33 కేవీ తీగలపై పడి.. ఒకదానికొకటి రాసుకుని తెగి మీద పడ్డాయి. దీంతో షాక్ కొట్టి ముగ్గురికి ముఖం, చేతులు కాలిపోయాయి. వెంటనే108లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం కరీంనగర్‌కు పంపారు. ఘటనపై పోలీస్, ట్రాన్స్‌కో అధికారులు ఆరా తీస్తున్నారు.