బాసర గోదావరిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు

బాసర గోదావరిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు

బాసర గోదావరి నది తీరంలోవిషాదం నెలకొంది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తూ నదిలో మునిగి గల్లంతయ్యారు. 

గోదావరి నదిలో గల్లంతైన బాధితులు హైదరాబాద్‌లోని కాచిగూడకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. కాచిగూడ చెప్పల్ బజార్‌కు చెందిన అన్నదమ్ములు చంద్రశేఖర్ (38 ఏళ్లు), రామచందర్ (36 ఏళ్లు)తో పాటు.. వారి బంధువు మల్లేష్ కుమార్ (31 ఏళ్లు) నీట మునిగి గల్లంతైనట్లు తెలుస్తోంది.

కుటుంబ సమేతంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన వీరంతా.. మొదట గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దిగారు. అయితే నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో.. ఒకరినొకరు కాపాడుకునే క్రమంలో ముగ్గురూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

ALSO READ : హరీష్ రావువన్నీ అభాండాలే..

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గోదావరి నదిలో గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కళ్లముందే నదిలో కలిసిపోవడంతో బాధితుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.