భారత్‌కు రేపు మరో 3 రాఫెల్స్‌‌

భారత్‌కు రేపు మరో 3 రాఫెల్స్‌‌

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌‌ నుంచి మరో 3 రాఫెల్‌‌ ఫైటర్‌‌ జెట్స్‌‌ ఇండియాకు రానున్నాయి. ఫ్రాన్స్‌‌లోని మెరిగ్నాక్‌‌ ఎయిర్‌‌బేస్‌‌ నుంచి బుధవారం పొద్దున 7 గంటలకు యుద్ధ విమానాలు బయలుదేరనున్నాయి. అదే రోజు రాత్రి 7 గంటలకు గుజరాత్‌‌లో దిగనున్నాయి. యూఏఈ ఎయిర్‌‌ఫోర్స్‌‌కు చెందిన ఎయిర్‌‌ బస్‌‌ 330 మల్టీరోల్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ట్యాంకర్‌‌ ఆకాశంలో వీటికి ఫ్యూయెల్‌‌ అందించనుంది. ఏప్రిల్‌‌లో మరో 9 యుద్ధ విమానాలు ఇండియా చేరుకుంటాయి. వీటిలో ఐదింటిని ఉత్తర బెంగాల్‌‌లోని హషిమర ఎయిర్‌‌బేస్‌‌లో అందుబాటులో ఉంచుతారు. 2021 డెలివరీ షెడ్యూల్‌‌ ప్రకారం రాఫెల్‌‌ ఫైటర్‌‌ జెట్స్‌‌ ఇండియా చేరుకోనున్నాయి. ఈ మూడు యుద్ధ విమానాలతో మన దగ్గర రాఫెల్స్‌‌ సంఖ్య 14కు చేరుకోనుంది. 36 రాఫెల్స్‌‌ కోసం 2016లో ఫ్రాన్స్‌‌తో ఇండియా ఒప్పందం చేసుకుంది.

ఇండియాలో రాఫెల్ ఇంజిన్స్‌‌ తయారీ
ఆత్మనిర్భర్‌‌ భారత్‌‌లో భాగంగా రాఫెల్‌‌ ఇంజిన్లను ఇండియాలో తయారు చేయాలని మన సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా ఇండియాకు ఫ్రాన్స్‌‌ తమ టెక్నాలజీని అందించనుంది. రాఫెల్‌‌లో ఎం883 సాఫ్రాన్‌‌ ఇంజిన్స్‌‌ వాడారు. వీటి థ్రస్ట్‌‌ 73 కిలో న్యూటన్లు. మన దేశంలో 90 నుంచి 100 కిలోన్యూటన్ల థ్రస్ట్‌‌తో ఇంజిన్లను రెడీ చేయాలని భావిస్తున్నారు. ఈ మాన్యుఫాక్చరింగ్‌‌ మొత్తం మధ్యవర్తులకు తావులేకుండా ప్రభుత్వాల నేతృత్వంలోనే సాగనుంది.