గర్భిణిని తీసుకెళ్తుండగా చెట్టును ఢీ కొట్టిన అంబులెన్స్

V6 Velugu Posted on Jun 10, 2021


తమిళనాడు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  కల్లకురిచి జిల్లా శంకరపురంలో అంబులెన్స్ అదుపు తప్పి  చెట్టును ఢీ కొనడంతో ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. డెలివరీ కోసం గర్భిణిని బంధువులు అంబులెన్స్ లో తీసుకెళ్తుండగా అలథూర్ సరస్సు సమీపంలో టైర్ పేలిపోయింది. అంబులెన్స్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. స్పాట్ లోనే గర్భిణి బంధువులు ఇద్దరు చనిపోయారు. వేరే అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆమె మృతి చెందింది. ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ తో పాటు మహిళా అసిస్టెంట్ గాయపడ్డారు. చనిపోయిన ముగ్గురి డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం కల్లకురిచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Tagged tamilnadu, Three people die, ambulance crashes, roadside tree, Kannur

Latest Videos

Subscribe Now

More News