చండీగఢ్‌లో ముగ్గురు విద్యార్థినుల సజీవ దహనం

చండీగఢ్‌లో ముగ్గురు విద్యార్థినుల సజీవ దహనం

హాస్టల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు విద్యార్థినిలు అగ్నికి ఆహుతయ్యారు. ఈ విషాద ఘటన చండీగఢ్‌లో జరిగింది. సెక్టార్ 32లోని పీజీ హాస్టల్‌లో ల్యాప్‌టాప్‌ చార్జింగ్‌ పెడుతుండగా మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. బిల్డింగ్ మొదటి అంతస్తులో చనిపోయిన ఈ విద్యార్థినులు పేయింగ్‌ గెస్ట్‌లుగా వుంటున్నారని చండీగఢ్‌ పోలీసు సూపరింటెండెంట్ వినీత్ కుమార్ తెలిపారు.

19 నుంచి 22 ఏళ్ల వయస్సున్న వీరిని పంజాబ్‌, హర్యానాకు చెందిన ముస్కాన్, రియా, ప్రాక్షిగా గుర్తించారు. మంటలు చెలరేగిన సమయంలో ఓ విద్యార్థిని భవనం పైనుంచి కిందికి దూకేయడంతో తీవ్ర గాయాలపాలైంది. గాయపడిన ఆ విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. హాస్టల్‌లో మొత్తం 36 మంది విద్యార్థులు ఉంటున్నారని.. భవనంలో కనీస భద్రతా ప్రమాణాలు కూడా లేవని తెలుస్తోంది.