
వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందగా..మరో 8 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.