
స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టార్ థ్రిల్లర్ మూవీ ‘థగ్ లైఫ్’. నేడు (జూన్ 5న) ఈ మూవీ థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మణిరత్నం తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు ఆడియన్స్, నెటిజన్స్ తమదైన రివ్యూలు ఇస్తున్నారు.
ఫస్టాఫ్‌లో కమల్ హాసన్ షో మొత్తం దోచేశాడని.. సినిమాకు శింబు మరో ప్రధాన బలమని అంటున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్‌తో పాటు యాక్షన్ సీన్స్ గూస్బంప్స్ తెప్పించేలా ఎంగేజింగ్‌గా ఉన్నాయని టాక్ వస్తోంది.
అయితే, భారీ అంచనాల మధ్య రిలీజైన థగ్ లైఫ్ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత రాబట్టాలి? రిలీజ్‌కు ముందే, బిజినెస్ ఎంత జరుపుకుంది? అనే పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.
థగ్ లైఫ్ బడ్జెట్ & బిజినెస్:
థగ్ లైఫ్ సినిమాను రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ రిలీజ్ చేసింది. ఈ సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారని సినీ వర్గాల టాక్. మొత్తం ప్రమోషన్స్ ఖర్చుతో కలిపి రూ.200 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం.
ఇకపోతే, ఈ సినిమా ఓవర్సీస్, తమిళం, రెస్ట్ ఆఫ్ ఇండియా అన్ని కలిపి రూ.105 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వాలంటే వరల్డ్ వైడ్ గా రూ.106 కోట్ల షేర్, రూ.210 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకోవాల్సి ఉంది. తెలుగులో థగ్ లైఫ్ మూవీ రూ.11 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. దాంతో తెలుగులో రూ.12 కోట్ల షేర్ రాబడితే బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.
థగ్ లైఫ్ అడ్వాన్స్ బుకింగ్స్:
తమిళ భాషలో తెరకెక్కిన థగ్ లైఫ్ మూవీ.. తెలుగు, హిందీ భాషల్లోనూ డబ్ అయింది. తమిళ్లో బుకింగ్స్ అదరగొట్టింది. ఫస్ట్ రోజు తమిళ్ లోనే రూ.5.3 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. ఇందులో 2డీ వర్షన్ రూ.5.25 కోట్లు కాగా.. ఐమాక్స్ 2డీ రూ.11.63 లక్షలు, 4డీఎక్స్ రూ.70.470.
తెలుగు అడ్వాన్స్ బుకింగ్స్ మౌత్ టాక్ తోనే జరుగుతున్నాయి. తొలిరోజు తెలుగు బుకింగ్స్‌కు రూ.54 లక్షలు వచ్చాయి. హిందీలో రూ.26 లక్షలుగా ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే అన్ని భాషల్లో కలిపి.. ఫస్ట్ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.6.16 కోట్లు వచ్చాయి. ఇక థగ్ లైఫ్ మూవీకి మొత్తంగా అడ్వాన్స్ సేల్స్ రూ.13.89 కోట్లుగా ఉంది.
ఇదిలా ఉంటే.. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 ఫస్ట్ డే అడ్వాన్స్ రూ.11 కోట్లు వచ్చాయి. ఈ బుకింగ్స్‌ను.. థగ్ లైఫ్ బీట్ చేసింది. అలాగే, కమల్ హాసన్ నటించిన చివరి మూవీ ఇండియన్ 2ని మాత్రం థగ్ లైఫ్ అందుకోలేకపోయింది. ఇండియన్ 2 మూవీ రూ.17.9 కోట్ల అడ్వాన్స్ కలెక్షన్లు రాబట్టగా.. థగ్ లైఫ్ మాత్రం అడ్వాన్స్ సేల్స్ రూ.13.89 కోట్లుగా ఉంది. మరి ఇపుడు రాబోయే వసూళ్లతో ఎలాంటి సత్తా చాటుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది.