సర్వేల ఆధారంగానే గడ్డం వంశీకృష్ణకు టికెట్ : మంత్రి శ్రీధర్ బాబు

సర్వేల ఆధారంగానే గడ్డం వంశీకృష్ణకు టికెట్ :   మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి  పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు, మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ ఒకే వేదికపైకి వచ్చి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్.. బేగంపేటలో ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు. పెద్దపల్లి  విజయరమణారావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తదితరులు మాట్లాడారు. ఈ సందర్బంగా పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి కాకా చేసిన సేవలను స్మరించుకున్నారు. కాకా బాటలోనే వంశీ కూడా పెద్దపల్లిని అభివృద్ధి చేస్తారని చెప్పారు. 

పెద్దపల్లి టికెట్ కోసం నలుగురైదుగురు నేతలు పోటీ పడ్డారని, ఆ సెగ్మెంట్ లో నిర్వహించిన సర్వేల ఆధారంగానే ఏఐసీసీ టికెట్ కేటాయించిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. గడ్డం వంశీకృష్ణ విద్యావంతుడని, దివంగత నేత కాకా వెంకటస్వామిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారని ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గడ్డం వంశీ విద్యావంతుడని అన్నారు.  ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే యువతకు టికెట్లు ఇవ్వాలని భావించే వంశీ కృష్ణకు కేటాయించారన్నారు. శాస్త్రీయబద్ధంగా సర్వేలు చేయించిన మీదటే వంశీకృష్ణకు అధినాయకత్వం టికెట్ ఇచ్చిందని అన్నారు.  మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేంద్రంలో ఏర్పడబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.