ఆదిలాబాద్లో మరోసారి పులి సంచారం

ఆదిలాబాద్లో మరోసారి పులి సంచారం

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసీ–కేలో పులి సంచారం మరోసారి కలకలం రేపుతోంది. పిప్పల్ కోటి రిజర్వాయర్ దగ్గర కార్మికులు పులిని చూశారు. పులి భయంతో వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇప్పటికే తాంసీ–కే సమీపంలో నాలుగు పులులు సంచరిస్తున్నాయి.

దీంతో స్థానికులు పొలాల దగ్గరికి వెళ్లాలంటే భయపడుతున్నారు. చనాక కోరట కెనాల్ లోనూ ఇటీవలే పులులు కనిపించాయి. వీటి జాడ కోసం ఫారెస్ట్ ఆఫీసర్లు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మొన్నటికి మొన్న ఆసిఫాబాద్ జిల్లా నుంచి పులి తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. అదే సమయంలో మరో పులి ఇటువైపు వచ్చిందంటున్నారు.