- చెనాక కొరాట పంప్ హౌస్ , హత్తిఘాట్ దగ్గర కెనాల్ పరిసరాల్లో పెద్దపులుల సంచారం
ఆదిలాబాద్ జల్లాలో పెద్దపులుల సంచారం కలకలం రేపుతోంది. జనావాసాలకు చాలా దగ్గరగా సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. చెనాక కొరాట పంప్ హౌస్ దగ్గర పెద్ద పులులు తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హత్తిఘాట్ దగ్గర కెనాల్ లో స్థానికులకు రెండు పెద్ద పులులు కనిపించడంతో ఆ ప్రాంత ప్రజలు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
జనావాసాలకు చాలా సమీపంలో పెద్ద పులుల సంచారం జరుగుతోందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజులుగా పెన్ గంగా పరివాహక ప్రాంత పొలాల్లో పులులు కనిపిస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. మహారాష్ట్రలోని టిపేశ్వర్ పులుల అభయారణ్యం నుంచి పెద్ద పులులు వచ్చినట్టు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.