గద్వాల, వెలుగు : మల్దకల్ తిమ్మప్ప స్వామి జాతర లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఎస్పీ జాతర స్థలాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఐజవైపు నుంచి వచ్చే వాహనాలకు కేజీబీవీ స్కూల్ పక్కన, గద్వాల వైపు నుంచి వచ్చే వాహనాలకు పీహెచ్ సీ సెంటర్ వద్ద, ఎల్కూర్ నుంచి వచ్చే వాహనాలకు ట్రినిటీ స్కూల్ దగ్గర, మద్దెల బండ నుంచి వచ్చే వాహనాలకు మల్దకల్ ఎంట్రెన్స్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఐదు రోజులపాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిబ్బందికి కేటాయించిన ప్రదేశాల్లో అప్రమత్తంగా డ్యూటీ చేయాలని పోలీసులకు సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ మొగులయ్య, సీఐలు శ్రీను, టాటా బాబు, మల్దకల్ ఎస్సై నందికర్, గద్వాల రూరల్ ఎస్సై శ్రీకాంత్ ఉన్నారు.
