కేజ్రీవాల్ నిక్షేపంగా ఉన్నారు.. బరువు తగ్గలేదు, బీపీ పెరగలేదు.. : తీహార్ జైలు అధికారులు

 కేజ్రీవాల్ నిక్షేపంగా ఉన్నారు.. బరువు తగ్గలేదు, బీపీ పెరగలేదు.. : తీహార్ జైలు అధికారులు

ఢిల్లీ సీఎం అరవింద్  కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ నాయకులు ఆందోళన వ్యక్తం చేసిన వేళ తీహార్ జైలు అధికారులు స్టేట్‌మెంట్ విడుదల చేశారు. 2024 ఏప్రిల్ 1న జైలుకు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన బరువు 65కేజీల వద్ద స్థిరంగా ఉందని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయనకు ఇంటి భోజనాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.  

ఇద్దరు డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు చేశారని, ఆయన శరీర అవయవాల పనితీరు నార్మల్‌గానే ఉందని చెప్పారు. కేజ్రీవాల్ రక్తపోటు (బీపీ) స్థాయిని చివరిగా 116/80 వద్ద ఉందని చెప్పారు.మరోవైపు కేజ్రీవాల్ 4.5కేజీలు తగ్గారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్ ను  జైల్లో ఉంచడం ద్వారా బీజేపీ ఆయన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోందని ఢిల్లీ మంత్రి, ఆప్ నాయకురాలు అతిషి ఆరోపించారు.  

ALSO READ :- చంద్రబాబుకు పేదలపై ప్రేమ ఇప్పుడొచ్చిందా... పేర్ని నాని

మరోవైపు మంత్రి  ఆతిశీకి బీజేపీ లీగల్ నోటీస్ పంపించింది. తనను పార్టీలో చేరాలని లేదంటే అరెస్టుకు సిద్ధంగా ఉండాలని బీజేపీ బెదిరించినట్టు ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ ఆమెకు పరువునష్టం దావా నోటీస్ పంపింది. తమ పార్టీ తరఫున ఆమెను ఎవరు సంప్రదించారో వెల్లడించాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే ఢిల్లీ సీఎం  కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో ఆతిశీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.