ట్రంప్ దెబ్బకు టిక్‌టాక్ సీఈవో రాజీనామా

ట్రంప్ దెబ్బకు టిక్‌టాక్ సీఈవో రాజీనామా

టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెవిన్ మేయర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో టిక్‌టాక్ ను నిషేధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసిన కొన్ని రోజుల్లోనే కెవిన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సీఈఓ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ కెవిన్ టిక్‌టాక్ సిబ్బందికి ఓ లేఖ రాశారు. అందులో ‘నేను సంస్థను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నానని మీ అందరికీ తెలియజేయాలకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

కెవిన్ గత జూన్ లో చైనాకు చెందిన పేరెంట్ బైట్ డాన్స్ కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. కెవిన్ డిస్నీలో సుదీర్ఘమైన మరియు విజయవంతమైన కెరీర్ తరువాత టిక్‌టాక్‌లో చేరారు. కెవిన్ స్థానంలో టిక్‌టాక్ జనరల్ మేనేజర్ వెనెస్సా పప్పాస్ తాత్కాలిక ప్రాతిపదికన నియమితుడు కానున్నాడు.

వైట్ హౌస్ యొక్క జాతీయ భద్రతా ముప్పు కారణంగా కాలిఫోర్నియాకు చెందిన టిక్‌టాక్ మరియు బైట్‌డాన్స్ ను నిషేధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోని టిక్‌టాక్ యూజర్ల డాటాను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. రెండవసారి అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ట్రంప్.. నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చైనాపై వ్యతిరేకతను చూపుతున్నారు. అందులో భాగంగానే టిక్‌టాక్ పై నిషేధం విధిస్తూ.. ఆగస్టు 6న కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేశారు.

For More News..

నా కొడుకుకు రియా విషం పెట్టి చంపింది.. సుశాంత్ తండ్రి సెల్ఫీ వీడియో

శానిటైజర్ ఇచ్చి టెంపరేచర్ చెక్ చేసే అందమైన ‘జఫిరా’

తెలంగాణలో కొత్తగా 2,795 కరోనా పాజిటివ్ కేసులు

కార్యకర్తలకు న్యాయం చేయలేనపోతున్నానని లోక్ సభ ఎంపీ రాజీనామా