స్కూలు ఎప్పుడు కూలుతుందో.. బిక్కుబిక్కుమంటున్న స్టూడెంట్స్​

స్కూలు ఎప్పుడు కూలుతుందో.. బిక్కుబిక్కుమంటున్న స్టూడెంట్స్​

వంగూర్, వెలుగు:మండలంలోని తిప్పారెడ్డిపల్లి అప్పర్​ ప్రైమరీ స్కూల్​ శిథిలావస్థకు చేరుకుంది. భవనం పై పెచ్చులు ఊడిపోతున్నాయని, ​ ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో గడుపుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. 

స్కూల్ ప్రమాదం అంచున ఉందని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని ప్రభుత్వం చెప్తున్నా ఆదిశగా చర్యలు లేవని, వెంటనే కొత్త భవనం మంజూరు చేయాలని కోరుతున్నారు.