Summer Tour : టూర్ వెళుతున్నారా.. మీ బ్యాగులు ఇలా సర్దుకోండి.. ఈ టిప్స్ తెలుసుకోండి..!

Summer Tour : టూర్ వెళుతున్నారా.. మీ బ్యాగులు ఇలా సర్దుకోండి.. ఈ టిప్స్ తెలుసుకోండి..!

ప్రయాణాలలో చాలా మంది లగేజీ బ్యాగ్ గురించి అసలు పట్టించుకోరు. అయితే, జర్నీ సమయంలో అనువైన బ్యాగ్ ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. తక్కువ బరువును మాత్రమే మోయగలం అనుకునే వాళ్లు వీల్స్ ఉన్న బ్యాగ్స్ వాడాలి. రోలింగ్, బ్యాక్ పాక్ బ్యాగ్స్ కూడా ప్రయాణానికి అనువైనవే. షోల్డర్ బ్యాగ్ ఉంటే మంచిది. షోల్డర్ బ్యాగు తగిలించుకుని మరో బ్యాగ్ను చేత్తో పట్టుకుని, రోలింగ్ బ్యాగ్ ను మరో చేత్తో పట్టుకుంటే దాదాపుగా లగేజీ మొత్తం మీ చేతుల్లో ఉన్నట్లే. బ్యాగ్ లో దుస్తులని ఎంత బాగా సర్దినా ముడతలు పడతాయి. అందుకే టూర్లకు వెళ్లేప్పుడు టీ షర్ట్లు, జీన్స్.. లాంటివి తీసుకెళ్లడం బెటర్. 

Also Read:బాలి దేశం చూసొద్దామా.. హైదరాబాద్ నుంచి 8 గంటలే.. ఆధ్యాత్మికం, ఆహ్లాదం

కొన్ని  ప్లాస్టిక్ బ్యాగ్ లను అదనంగా పెట్టుకోవడం కూడా మంచిది. దుస్తులపై సాస్, కర్రీ.. లాంటివి పడితే వాటిని ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు. డ్యామేజ్ కు గురయ్యే వస్తువులను దుస్తులున్న బ్యాగ్ లో పెట్టుకోవద్దు. అవి పగిలినా, వాటిల్లో ఉండే పదార్థాలు లీకైనా దుస్తులు పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి వస్తువులను ప్లాస్టిక్ బ్యాగ్ లో సర్దుకోవాలి.