మెయిన్స్​లో మెరవాలంటే ఈ టిప్స్ ఫాలోవ్వండి

మెయిన్స్​లో మెరవాలంటే ఈ టిప్స్ ఫాలోవ్వండి

దేశంలోనే అత్యున్నత సర్వీస్​లో అడుగుపెట్టడానికి యూపీపీఎస్సీ నిర్వహించే సివిల్స్​ పరీక్షలో ప్రిలిమ్స్​ పూర్తయింది.   10,564 మంది మెయిన్స్​కు అర్హత సాధించారు.  జనవరి 8 నుంచి ప్రారంభం కానున్న మెయిన్స్​ ఎలా క్లియర్​ చేయాలి.., ఎలాంటి ప్లాన్​తో ముందుకెళ్లాలో సబ్జెక్ట్​ ఎక్స్​పర్ట్​ గైడెన్స్​..

అంత్యంత క్లిష్టమైన మూడంచెల సివిల్స్​ ఎగ్జామ్​లో రెండో దశ మెయిన్స్​ మరో రెండు నెలల్లో జరుగనుంది. అభ్యర్థులు ప్లాన్​ ప్రకారం ప్రతిరోజూ ఆన్సర్​ రైటింగ్​ ప్రాక్టీస్​ చేయాలి. కరెంట్​ అఫైర్స్ రెగ్యులర్​గా ఫాలో అవ్వాలి.  టైమ్​ మేనేజ్​మెంట్​ చేసుకుంటూ ఎక్కువ మార్క్స్​ వచ్చే అంశాలపై దృష్టి పెట్టాలి.

ఎస్సే, ఎథిక్స్​, ఆప్షనల్స్​..

మెయిన్స్​ ఎగ్జామ్​ మంచి మార్కులతో క్లియర్​ చేయాలంటే ఎస్సే, ఎథిక్స్​, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్​, ఆప్షనల్​ సబ్జెక్ట్స్​పై మంచి పట్టు ఉండాలి. వీటిలో మంచి మార్క్స్​ వస్తే మెయిన్స్​ ఈజీగా క్లియర్​ చేసే ఛాన్స్​ ఉంటుంది. మొత్తం మెయిన్స్​ 1750 మార్కుల్లో 1000 మార్కులు ఈ సబ్జెక్ట్స్​ నుంచే వస్తున్నాయి. మిగిలిన 750 మార్కులు జనరల్​ స్టడీస్​కు కేటాయించారు. ఇప్పుడు ప్రిలిమ్స్​లో లేని సిలబస్​తో పాటు డైలీ కరెంట్​ అఫైర్స్​ కోసం న్యూస్​ ఛానల్స్​, పేపర్స్​ ఫాలోకావాలి.

రైటింగ్​ ప్రాక్టీస్​..

మెయిన్స్​ ఎగ్జామ్​ డిస్క్రిప్టివ్​ తరహాలో ఉంటుంది కాబట్టి ఎక్కువగా రైటింగ్​ ప్రాక్టీస్​ చేయాలి. ఎస్సే వారానికి రెండు సార్లు సాధన చేయాలి. వ్యాసాలకు(ఎస్సే) కరెంట్​ అఫైర్స్​ లింక్​ చేసి ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఎస్సేలో సైన్స్​ అండ్​ టెక్నాలజీ, ఫిలాసఫీ, ఎకానమీ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి వాటి మీద ఫోకస్​ చేయాలి. ఎథిక్స్​ ఇంటెగ్రిటీ ఆప్టిట్యూడ్​ పేపర్​లో కేస్​ స్టడీస్​ ముఖ్యమైనవి. ఇవే ఎక్కువగా స్కోరింగ్​. కేస్​ స్టడీస్​ ఆధారంగా ఆన్సర్​ రైటింగ్​ ప్రాక్టీస్​ చేయాలి. న్యూస్​ పేపర్​లో వచ్చే ఎడిటోరియల్స్ బాగా చదవాలి. ఉదాహరణలతో జవాబులు రాస్తే ఎక్స్ ట్రా మార్క్స్​ పొందే అవకాశం ఉంటుంది. పాలన(గవర్నన్స్​)కు  సంబంధించిన అంశాల నుంచి రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నందున వాటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆప్షనల్​ పేపర్​లో ఎక్కువ స్కోర్​ చేసేలా అభ్యర్థులు నోట్స్​ తయారు చేసుకొని ఆన్సర్​ రైటింగ్​ ప్రాక్టీస్​ చేయాలి.

పాలిటీపై పట్టు..

ఇండియన్​ పాలిటీపై అభ్యర్థులు పట్టు సాధించాలి. సర్వీస్ లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇండియన్​ సొసైటీ అంశాలకు ఎన్​సీఆర్​టీ పదకొండు, పన్నెండో తరగతి బుక్స్​ చదవాలి.  ఇంటర్నెట్​ ఉపయోగించి ఏఆర్​సీ రిపోర్ట్స్​, పాలనకు సంబంధించిన అంశాలను నేర్చుకోవాలి. పాలిటీ కోసం డి.డి.బసు బుక్​ ప్రాక్టీస్​ చేస్తే మంచిది. కరెంట్​ అఫైర్స్​ కోసం ది  హిందు, బిగ్​ పిక్చర్​, రాజ్యసభ టీవీ, పీఆర్ఎస్​ ఇండియా, ఆల్​ ఇండియా రేడియ వెబ్​సైట్లు మరియు యోజన లాంటి మ్యాగజైన్స్​ ప్రిపేర్​ అవ్వాలి. అత్యున్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు) తీర్పుల్లో ముఖ్యమైనవి రిఫరెన్స్​గా రాయవచ్చు. ఏదైన అంశం చర్చించేటప్పుడు ఇరువైపుల వాదనలు రాయాలి. ఆరోగ్యం, మహిళలు, విద్య, పేదరికం, ఉపాధికి సంబంధించిన గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయ సంబంధాల గురించి చదవడం మర్చిపోవద్దు.

సర్వేలు, కరెంట్​ అఫైర్స్​పై దృష్టి..

జనరల్​ స్టడీస్​లోని పేపర్​-3 కోసం బడ్జెట్​, ఆర్థిక సర్వేల మీద ఫోకస్​ చేయాలి. ఇందులో ఎక్కువగా కరెంట్​ అఫైర్స్​ రిలేటెడ్​ ప్రశ్నలు అడుగుతారు కాబట్టి అగ్రికల్చర్​, భూ సంస్కరణలు, మౌలిక సదుపాయాల అంశాలపై అప్డేట్​ అవ్వాలి. విపత్తు నిర్వహణ(డిజాస్టర్​ మేనేజ్​మెంట్​) కోసం ఎన్​డీఎమ్​ఏ మీద నోట్స్​ ప్రిపేర్​ చేసుకోవాలి.  టైమ్​ మేనేజ్ చేసుకుంటూ పక్కా ప్లానింగ్​ తో ప్రతిరోజూ ప్రాక్టీస్​ చేస్తే తప్పకుండా విజయం మీదే.

రివిజన్​ ముఖ్యం

చాలా మంది అభ్యర్థులు కొత్త పుస్తకాలు కొని ఎక్కువగా చదవాలనే అపోహలో ఉంటారు. తక్కువ పుస్తకాలను ఎక్కువ సార్లు చదివి రివిజన్​, మైండ్​ మ్యాప్​ చేసుకుంటే ఎగ్జామ్​లో బాగా రాయవచ్చు. సిలబస్​ లో ఉన్న అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.

అర్హత పేపర్స్​ మర్చిపోవద్దు

అర్హత పేపర్లు(ఇంగ్లీష్, ఇండియన్​ లాంగ్వేజ్​) మర్చిపోకుండా వాటికోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలి. టైమ్​ మేనేజ్ చేసుకుంటూ అన్ని ప్రశ్నలకు ఆన్సర్​ రాసేలా ప్రాక్టీస్​ చేయాలి. ఇందుకోసం టెస్ట్​ సిరీస్​ ఎక్కువగా రాయాలి. దీంతో అభ్యర్థులు చేసే తప్పులు సరిచేసుకునే వీలు కలుగుతుంది.  ప్రశ్నకు సరైన ఆన్సర్​ సూటిగా రాయాలి స్పేస్​ పరిమితంగా ఉంటుంది. జవాబులు పాయింట్స్​, ఫ్లోచార్ట్​ రూపంలో రాయాలి. జనరల్​ స్టడీస్​ లో ఎక్కువ మార్కులు పొందడానికి ఎన్​సీఆర్​టీ బుక్స్​ చదవాలి. ఇంటర్నెట్​ ద్వారా లేటెస్ట్​ ఇన్ఫర్మేషన్​ వీడియో రూపంలో చూడడం ద్వారా సబ్జెక్ట్​ ఈజీగా గుర్తుంటుంది. మోడ్రన్​ ఇండియన్​ హిస్టరీ, వరల్డ్​ హిస్టరీ చదివేటప్పడు నోట్స్​ ప్రిపేర్​ చేసుకొని చారిత్రక సంఘటనలు గుర్తుంచుకోవాలి.

– డి.నిహారిక రెడ్డి, ఐఏఎస్​ బ్రైన్స్​ డైరెక్టర్

For More News..

న్యాయవ్యవస్థ స్వతంత్రత కాపాడాలి

తెలంగాణ యువత గోస కనబడతలేదా?

దుబ్బాక రిజల్ట్స్​ ప్రకటించొద్దు