శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

తిరుమల శ్రీవారికి మరోసారి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. సోమవారం ఒక్క రోజే 6 కోట్ల 18 లక్షల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.ఈ ఏడాదిలో   శ్రీవారి హుండీ ఆదాయం 6 కోట్ల మార్క్ దాటడం రెండోసారి అని అన్నారు టీటీడీ అధికారులు. కరోనా కంటే ముందు 2018 జులై 26న శ్రీవారి హుండీ ఆదాయం 6 కోట్ల 28 కోట్లు వచ్చిందన్నారు. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైం రికార్ట్ అని తెలిపారు. అంతకముందు 2012 ఏప్రిల్ 1వ తేదీన  5 కోట్ల 73 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. కరోనా తర్వాత భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు  భారీగా తరలి వస్తున్నారు. దీంతో నగదు, బంగారం, వెండి రూపంలో భక్తులు స్వామి వారికి ముడుపులు చెల్లించుకుంటున్నారు.