బెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఎంసీ హవా

బెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఎంసీ హవా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. మొత్తం 108 మున్సిపాలిటీలకు గాను 102 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుని ప్రతిపక్షాలను చావుదెబ్బ కొట్టింది. బుధవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 2,170 వార్డులకు గాను టీఎంసీ 1,870 వార్డులను సాధించి తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో టీఎంసీ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. కాగా.. పది నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మమతా బెనర్జీ మూడోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తల కోసం

ధరణితో కొత్త సమస్యలు సృష్టించారు

రేప్ కేసులో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అరెస్టు