మమతా బెనర్జీకి షాక్..టీఎంసీ ఎంపీ కకోలీ దస్తిదార్ రాజీనామా

మమతా బెనర్జీకి షాక్..టీఎంసీ ఎంపీ కకోలీ దస్తిదార్ రాజీనామా

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలు, కుడిభుజం లాంటి పార్టీ సీనియర్ లీడర్ కకోలి దస్తీదార్  టీఎంసీ  పార్టీ అన్ని పదవులకు రాజీనామా చేశారు. సీఎం సువేందు అధికారితో సమావేశమయిన కొన్ని గంటల తర్వాత తన రాజీనామాను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. టీఎంసీనుంచి నాలుగు ఎంపీ అయిన కకోలి తృణమూల్ కాంగ్రెస్ బరసత్ పార్లమెంటరీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజులకే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అఖిల భారత తృణమూల్ మహిళా కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ పదవితో పాటు, పార్టీలోని ఇతర సంస్థాగత పదవులు, కమిటీలు ,బాధ్యతలకు రాజీనామా చేశారు.  చదువుకోని, మొరటు స్వభావం గల మరో పార్టీ ఎంపీ.. ఓ మహిళా ఎంపీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటే సీనియర్ పార్టీ నేతలు ఆపలేనప్పుడు, అలాంటి పదవిలో కొనసాగడంలో అర్థం లేదు " అని కకోలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

‘‘నాకు మమతా బెనర్జీ 1976 నుంచి తెలుసు..1984 నుంచి మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాము..నాలుగు దశాబ్దాల నా విధేయతకు ఈరోజు నాకు బహుమతి లభించింది " అని పరోక్షంగా సెటైర్లు వేస్తూ ఆమె X ఖాతాలో రాశారు.

పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించడంతోపాటు పార్లమెంట్ లో పార్టీ చీఫ్ విప్ గా తన గళం వినిపించారు కకోలి. బీజేపీ పాలిత కేంద్రంపై విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేసేవారు. అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేసినప్పటికీ, ఎంపీ పదవికి మాత్రం వైదొలగలేదు. అంతేకాకుండా ఆమె పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించకపోవడం గమనార్హం. 

కకోలీ తన రాజీనామా లేఖలో పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అవినీతి ఆరోపణలు, ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలపై కాకోలి పార్టీని తప్పు బట్టడం పెద్ద దుమారం  రేపుతోంది.