హ్యాట్రిక్‌  దక్కేనా!: వరుసగా మూడో సిరీస్‌పై కోహ్లీసేన గురి

V6 Velugu Posted on Mar 28, 2021

నేడు -ఇంగ్లండ్‌తో టీమిండియా మూడో వన్డే
పుణె: టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచాం. గట్టి పోటీ ఎదురైనా టీ20 సిరీస్‌‌‌‌నూ కైవసం చేసుకున్నాం. ఇక మిగిలింది ఒక్క మ్యాచే. దాన్ని గెలిస్తే ఓ పనైపోతుంది. వరుసగా మూడు సిరీస్‌‌‌‌ విక్టరీలతో హ్యాట్రిక్‌‌‌‌  సొంతమవుతుంది. కాబట్టి ఆదివారం జరిగే మూడో, ఆఖరి వన్డేలో టీమిండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. రెండో వన్డేలో చేసిన మిస్టేక్స్‌‌‌‌ను సరిదిద్దుకొని ఇంగ్లండ్‌‌‌‌ పని పట్టాలని కోరుకుంటోంది. అయితే, అది అనుకున్నంత ఈజీ కాబోదు. బ్యాటింగ్‌‌‌‌కు స్వర్గధామంగా ఉన్న ఎంసీఏ పిచ్‌‌‌‌పై ఎంత టార్గెట్‌‌‌‌ ఉంచినా అద్భుతంగా బౌలింగ్‌‌‌‌ చేస్తే తప్ప దాన్ని కాపాడుకునే పరిస్థితి లేదు. గత పోరులో 337 రన్స్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ను ఇంగ్లండ్‌‌‌‌ అంత ఈజీగా ఛేజ్‌‌‌‌ చేసిన తర్వాత కోహ్లీసేన తమ బౌలింగ్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌పై పునరాలోచన చేయాల్సిన వస్తోంది. శుక్రవారం మన  స్పిన్నర్లు పూర్తిగా తేలిపోయారు. జానీ బెయిర్‌‌‌‌స్టో, బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌.. వాళ్లను ఓ ఆటాడుకున్నారు. చైనామన్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ అయితే ఓ వన్డే ఇన్నింగ్స్‌‌‌‌లో అత్యధిక సిక్సర్లు (8) ఇచ్చిన ఇండియన్​ బౌలర్‌‌‌‌గా చెత్త రికార్డు సొంతం చేసుకున్నాడు.  అతను ఏకంగా 84 రన్స్‌‌‌‌ లీక్‌‌‌‌ చేశాడు.  క్రునాల్‌‌‌‌ పాండ్యా సైతం తేలిపోయాడు. ఆరు ఓవర్లోనే 12 యావరేజ్‌‌‌‌తో 72 రన్స్‌‌‌‌ ఇచ్చుకున్నాడు.  ఓవరాల్‌‌‌‌గా రెండు మ్యాచ్‌‌‌‌ల్లో కలిపి వీరిద్దరూ 35 ఓవర్లలో 283 రన్స్‌‌‌‌ ఇచ్చి ఒకే ఒక్క వికెట్‌‌‌‌ తీశారు. ఈ నేపథ్యంలో  ఈ ఇద్దరి ప్లేస్‌‌‌‌లో లెగ్ స్పిన్నర్‌‌‌‌ యుజ్వేంద్ర చహల్‌‌‌‌తో పాటు సుందర్‌‌‌‌ను మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ బరిలోకి దింపొచ్చు. సుందర్‌‌‌‌ బ్యాట్‌‌‌‌తోనూ రాణించగలగడం ప్లస్‌‌‌‌ పాయింట్‌‌‌‌ కానుంది. చహల్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో లేకున్నప్పటికీ ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లో అతని అవసరం ఉందనిపిస్తోంది. ఒకవేళ బరిలోకి దింపితే జట్టును గెలిపించే బాధ్యతను ఈ లెగ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ తీసుకోవాల్సి ఉంటుంది. చాన్నాళ్లుగా లిమిటెడ్‌‌‌‌ ఓవర్ల ఫస్ట్‌‌‌‌ చాయిస్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌గా ఉన్న అతను మ్యాచ్‌‌‌‌ను మలుపు తిప్పి చాలా కాలం అవుతోంది.  ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ కాబట్టి క్రునాల్‌‌‌‌కు అవకాశం ఉన్నా.. లెఫ్టార్మ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌గా అతను టీమ్ లాంగ్‌‌‌‌టర్మ్‌‌‌‌ ప్లాన్స్‌‌‌‌లో లేనందున సుందర్‌‌‌‌కు మరో చాన్స్‌‌‌‌ ఇవ్వొచ్చు.  గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన భువనేశ్వర్‌‌‌‌తో పాటు యంగ్‌‌‌‌ పేసర్లు శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ బాగానే రాణిస్తున్నారు. కానీ,  న్యూ బాల్‌‌‌‌తో వికెట్లు పడగొట్టడం లేదు. స్టార్టింగ్‌‌‌‌లోనే వికెట్లు తీస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచొచ్చు కాబట్టి దీనిపై పేసర్లు దృష్టి పెడితే మంచిది. ముఖ్యంగా ఫుల్‌‌‌‌ జోష్‌‌‌‌లో ఉన్న  ఓపెనర్లు జేసన్‌‌‌‌ రాయ్‌‌‌‌, జానీ బెయిర్‌‌‌‌స్టోతో పాటు డేంజర్‌‌‌‌ మ్యాన్‌‌‌‌ బెన్‌‌‌‌స్టోక్స్‌‌‌‌ను అడ్డుకునే మార్గాలు కనిబెట్టాలి. ఈ మ్యాచ్‌‌‌‌కు శార్దూల్‌‌‌‌కు రెస్ట్‌‌‌‌ ఇచ్చి యార్కర్ల స్పెషలిస్ట్‌‌‌‌ టి. నటరాజన్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ ఇవ్వొచ్చు.  
ఆరంభం నుంచే అదరగొట్టాల్సిందే
వరుసగా ఐదు వన్డేల్లోనూ ఇండియా 300 ప్లస్‌‌‌‌ స్కోరు చేసింది. ఈ లెక్కన ఈ ఫార్మాట్‌‌‌‌లో మన బ్యాటింగ్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ బాగా పని చేస్తున్నట్టే అనిపిస్తోంది. టీమ్‌‌‌‌ భారీ స్కోర్లు చేస్తున్నప్పటికీ చివరి 15 ఓవర్లలో చెలరేగి ఆడడం వల్లనే అవి సాధ్యమవుతున్నాయి. మాజీ కెప్టెన్‌‌‌‌ మహేంద్ర సింగ్‌‌‌‌ ధోనీ అనుసరించిన వ్యూహం ఇది. అది చాలాసార్లు వర్కౌట్‌‌‌‌ అయి మంచి రిజల్ట్స్‌‌‌‌ వచ్చినా ఇప్పుడున్న  పరిస్థితుల్లో  ఆ విధానానికి కాలం చెల్లింది అనొచ్చు. ఇండియన్స్‌‌‌‌ 30 ఓవర్లకు సింగిల్స్‌‌‌‌, డబుల్స్‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌రొటేట్‌‌‌‌ చేస్తూ గ్యాప్స్‌‌‌‌ గుండా అప్పుడప్పుడు బౌండ్రీలు రాబడితే మంచి పునాది పడుతుంది. కానీ, వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ విన్నర్‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ ట్రాక్స్‌‌‌‌పై స్టార్టింగ్‌‌‌‌ నుంచే ఎదురుదాడికి దిగుతోంది. శుక్రవారం 337 రన్స్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ను ఆ టీమ్‌‌‌‌ మరో 6.3 ఓవర్లు మిగిలుండగానే ఛేజ్‌‌‌‌ చేసింది. తొలి వన్డేలో కూడా ఫస్ట్‌‌‌‌ 20 ఓవర్ల వరకూ ఆ జట్టే పైచేయి సాధించింది. పవర్‌‌‌‌ప్లేను సద్వినియోగం చేసుకొని స్టార్టింగ్‌‌‌‌ నుంచే బౌండ్రీలతో దూకుడుగా ఆడడమే దీనికి కారణం. కాబట్టి ఇండియా కూడా పవర్‌‌‌‌ప్లేతో పాటు మిడిల్‌‌‌‌ ఓవర్లలో కాస్త జోరు పెంచాలి. అలా చేస్తే చివరి పది ఓవర్లలో పవర్‌‌‌‌హిట్టర్లు  హార్దిక్‌‌‌‌, పంత్‌‌‌‌ మరింత చెలరేగేందుకు దోహదం చేస్తుంది. ఒకవేళ భారీ టార్గెట్‌‌‌‌ ఛేజ్‌‌‌‌ చేయాలంటే  ముందునుంచే రన్‌‌‌‌రేట్‌‌‌‌ మెయింటేన్‌‌‌‌ చేయాల్సి ఉంటుంది.  ఇక, బ్యాక్‌‌‌‌ టు బ్యాక్‌‌‌‌ ఫిఫ్టీలతో  కెప్టెన్‌‌‌‌ కోహ్లీ ఫామ్‌‌‌‌లో ఉండగా, ధవన్‌‌‌‌, లోకేశ్‌‌‌‌ రాహుల్‌‌‌‌ జోరందుకోవడంతో హోమ్‌‌‌‌టీమ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ బలంగానే కనిపిస్తోంది. పంత్‌‌‌‌ కూడా ఓ మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌ ఆడాడు.  కానీ, ఓపెనర్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ  ఈ సిరీస్‌‌‌‌లో ఓ భారీ ఇన్నింగ్స్‌‌‌‌ బాకీ ఉన్నాడు. తన శుభారంభాలను సద్వినియోగం చేసుకుంటే హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ నుంచి హోలీ గిఫ్ట్‌‌‌‌ ఆశించొచ్చు. గత మ్యాచ్‌‌‌‌లో  ఫెయిలైన ధవన్‌‌‌‌ మళ్లీ  బ్యాట్‌‌‌‌ ఝుళిపిస్తే ఇండియాకు తిరుగుండదు. 

జోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌
తొలి వన్డేలో కొద్దిసేపు ఇండియాను వణికించి.. గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తిరుగులేని విక్టరీ సాధించిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌ జోష్‌‌‌‌‌‌‌‌లో ఉంది.  ఓపెనర్లు జేసన్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌, బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో సూపర్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌ ఆ టీమ్‌‌‌‌‌‌‌‌కు ప్లస్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌. గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో వీరిద్దరూ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌కు 135, 110 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి గొప్ప ఆరంభం ఇచ్చారు. మూడో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నారు. ఈ టూర్‌‌‌‌‌‌‌‌లో పెద్దగా ప్రభావం చూపని స్టార్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ బెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి రావడంతో టూరిస్ట్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ బలం రెట్టింపైంది. ఈ పోరులోనూ స్టోక్స్‌‌‌‌‌‌‌‌పైనే అందరి దృష్టి ఉండనుంది.  అయితే,  ఈ ముగ్గురిపైనే ఆధారపడకుండా మిగతా బ్యాట్స్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ కూడా రాణించాలని ఆ టీమ్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోరుకుంటోంది.  ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ సాధిస్తే  పేసర్‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌ వుడ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వస్తాడు. అది తప్ప ఇంగ్లండ్ ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌లో మార్పులు ఉండకపోవచ్చు. 

Tagged Cricket, India, england, ODI

Latest Videos

Subscribe Now

More News