తెలంగాణలో కొత్తగా 3464 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 3464 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. ఇవాళ 3,464 కొత్త కేసులు నమోదు కాగా 25 మంది కరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో 4 వేల 801 మంది కరోనా చికిత్సతో సంపూర్ణ ఆరోగ్యవంతులై ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా పాజిటివిటీ జాతీయ సగటు 1.1 శాతం ఉండగా తెలంగాణ జాతీయ సగటు కంటే తక్కువగా 0.56శాతం నమోదైంది. అలాగే జాతీయ రికవరీ రేటు 87.2 శాతం ఉండగా తెలంగాణ రాష్ట్ర సగటు రికవరీ 91.33 శాతం నమోదు అయింది. 
కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనవసరంగా బయటకొచ్చే వారి వాహనాలు సీజ్ చేస్తామని డీజీపీ హెచ్చరించారు. హైదరాబాద్ లో 11 చోట్ల మైక్రో కంటెంట్ జోన్లుగా ప్రకటించారు. వరంగల్ లో కేసులు ఎక్కువ ఉండడంతో రూరల్ జిల్లాలో 16 చోట్ల, అర్బన్ జిల్లాలో 12 చోట్ల మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. మిగిలిన జిల్లాల్లో కూడా పరిస్థితిని బట్టి.. కేసుల తీవ్రతను బట్టి మైక్రో కంటైన్మెంట్ జోన్లు ప్రకటించి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.