నేడు శ్రీలంకతో ఇండియా థర్డ్‌‌ వన్డే

నేడు శ్రీలంకతో ఇండియా థర్డ్‌‌ వన్డే

   మ. 1.30 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో లైవ్‌‌

తిరువనంతపురం: ఓవైపు సిరీస్‌‌‌‌‌‌‌ క్లీన్‌‌స్వీప్‌‌పై గురి.. మరోవైపు బౌలింగ్‌‌ ఆప్షన్స్‌‌పై దృష్టి.. ఈ నేపథ్యంలో మూడో వన్డే కోసం ఇండియా టీమ్‌‌ రెడీ అయ్యింది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌‌లో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే 2–0తో సిరీస్‌‌ను సొంతం చేసుకున్న రోహిత్‌‌సేన.. ఈ మ్యాచ్‌‌లో బౌలింగ్‌‌ ఆప్షన్‌‌ను చెక్‌‌ చేసుకోవాలని భావిస్తోంది. అలాగే న్యూజిలాండ్‌‌తో సిరీస్‌‌, బోర్డర్‌‌–గావస్కర్‌‌ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని వర్క్‌‌లోడ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌నూ అమలు చేయాలని చూస్తోంది. దీంతో పాటు వరల్డ్‌‌కప్‌‌ ఏడాది కావడంతో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. 

సిరీస్‌‌ క్లీన్‌‌స్వీప్‌‌ను దృష్టిలో పెట్టుకుని రెండో వన్డేలో ఆడిన టీమ్‌‌ను యధావిధిగా కొనసాగించే చాన్సెస్‌‌ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మార్పులు చేయాలనుకుంటే ఓపెనర్‌‌ గిల్‌‌, శ్రేయస్‌‌ అయ్యర్‌‌ను పక్కనబెట్టి సూర్యకుమార్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌ను ట్రై చేయొచ్చు. మిగతా లైనప్‌‌లో మార్పులు ఉండకపోవచ్చు. అయితే బౌలింగ్‌‌లో మార్పులు జరగొచ్చు. షమీకి రెస్ట్‌‌ ఇవ్వొచ్చు. అతని ప్లేస్‌‌లో అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌ రావొచ్చు. మిగతా పేసర్లుగా సిరాజ్‌‌, ఉమ్రాన్‌‌ను కంటిన్యూ చేయనున్నారు. రిస్ట్‌‌ స్పిన్నర్‌‌గా కుల్దీప్‌‌కే చాన్స్​ ఇవ్వనున్నారు. 

పరువు కోసం లంక..

వరుసగా రెండు మ్యాచ్‌‌ల్లో ఓడిన లంకేయులు.. కనీసం ఈ మ్యాచ్‌‌ నెగ్గి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నారు. దీంతో ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో భారీ మార్పులు ఉండకపోవచ్చు. కుశాల్‌‌ మెండిస్‌‌ ఎక్కువసేపు క్రీజులో ఉంటే ఇండియాకు కష్టాలు తప్పవు. నువాందు ఫెర్నాండో, కెప్టెన్‌‌ షనక, ఆవిష్క ఫెర్నాండో, దునిత్‌‌ వెలలాగేపై బ్యాటింగ్‌‌ భారం పడనుంది. బౌలింగ్‌‌లో కాసున్‌‌ రజిత, చామిక కరుణరత్నే మినహా మిగతా వారు అంచనాలను అందుకోవాలి. స్పిన్నర్లుగా వానిందు హసరంగ, ధనంజయ డిసిల్వా కీలకం కానున్నారు. 

జట్ల అంచనా

ఇండియా: రోహిత్‌‌ (కెప్టెన్‌‌), గిల్‌‌, కోహ్లీ, శ్రేయస్‌‌, రాహుల్‌‌, హార్దిక్‌‌, అక్షర్‌‌, కుల్దీప్‌‌, షమీ, ఉమ్రాన్‌‌, సిరాజ్‌‌. 

శ్రీలంక: డాసున్‌‌ షనక (కెప్టెన్‌‌), నిశాంక, ఆవిష్క ఫెర్నాండో, కుశాల్‌‌ మెండిస్‌‌, నువాందు ఫెర్నాండో / చరిత్‌‌ అసలంక, ధనంజయ డిసిల్వా, వానిందు హసరంగ, దునిల్‌‌ వెలలాగే, చామిక కరుణరత్నే, కాసున్‌‌ రజిత, లాహిర్‌‌ కుమార.