
బ్రెస్ట్ క్యాన్సర్‌తో ఫైట్ చేయొచ్చు
మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు లంగ్ క్యాన్సర్ కేసులు ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా బ్రెస్ట్ క్యాన్సర్ ఆ ప్లేస్‌ను దాటిపోయింది. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో ఈ లెక్కలు రిలీజ్ చేసింది. బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఒబెసిటీ ఉన్న మహిళలు మరింత జాగ్రత్తలు పాటించాలని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. లక్షణాలను ముందే కనిపెడితే.. వ్యాధిని ముదరకుండానే నయం చేయొచ్చు.
ప్రపంచంలో లంగ్ క్యాన్సర్ కేసుల కంటే బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ఒకప్పుడు సెకండ్ ప్లేస్‌లో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఇప్పుడు మొదటి స్థానానికి వచ్చాయని చెప్పింది. బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన పెరగాలని సూచించింది. లక్షణాలను ముందే పసిగడితే ట్రీట్‌మెంట్ సులువు అవుతుందని సూచించింది. మహిళల్లో ఉండే ఒబెసిటీ వల్ల ఎక్కువ శాతం బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ప్రపంచ జనాభా పెరగడం, ఆయుర్దాయం పెరిగేకొద్దీ క్యాన్సర్ మరింత పెరుగుతోందని, 2040 నాటికి 30 మిలియన్ల కొత్త కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో లెక్కల ద్వారా తెలుస్తోంది. గురువారం క్యాన్సర్ డే సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో ఈ లెక్కలు రిలీజ్ చేసింది. మహిళలు అవగాహన పెంచుకుని, వ్యాధి బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యూఎన్‌కు చెందిన క్యాన్సర్ స్పెషలిస్ట్ ఇల్బావి చెప్పారు.
ఎవరికి ముప్పు?
ఎనిమిది మంది మహిళల్లో ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. 55 ఏండ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. దాదాపు 35 – 54 ఏండ్ల మధ్య వయసు ఉన్నవారికి కూడా ముప్పు ఉందంటున్నారు. ముందే కనిపడితే క్యాన్సర్‌ను ఈజీగా అంతం చేయొచ్చు. ఎంత లేట్ అయితే ట్రీట్‌మెంట్ అంత క్రిటికల్ అవుతుంది. లోకలైజ్డ్ క్యాన్సర్ (బ్రెస్ట్ బయట స్ప్రెడ్ కాకుండా ఉండటం) ను త్వరగా నయం చేసుకోవచ్చు.
ఏంటీ బ్రెస్ట్ క్యాన్సర్?
మన శరీరంలో ఎన్నో కణాలు ఉంటాయి. ఆ కణాలు పుడుతూ ఉంటాయి.. నాశనం అవుతుంటాయి. అలా పెరిగే కణాల్లో కంట్రోల్ లేకపోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది. బ్రెస్ట్ భాగంలో అలా కణాలు పెరిగిపోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సహజంగా ఇది లోబ్యులర్ కార్నికోమా లేదా డక్టల్ కార్నికోమాలో మొదలవుతుంది. బ్రెస్ట్‌లో బాగా పెరిగిపోయిన కణాలు ఆ తర్వాత బ్లడ్ స్ట్రీమ్ ద్వారా లింఫ్ నోడ్స్, ఇతర అవయవాలకు పాకుతుంది. దీనివల్ల మన బ్రెస్ట్ చుట్టూ ఇన్వేడ్ టిష్యూ కూడా పెరుగుతుంది.
లక్షణాలు
పీరియడ్ టైంలో రొమ్ము లేదా చంకల్లో వాపు రావడం.
బ్రెస్ట్ సైజ్ లో, షేప్ లో లేదా కర్వ్‌లోమార్పులు సంభవించడం.
ఛాతిభాగం, నిపుల్ దగ్గర రంగు మారడం.
రొమ్ము దగ్గర గడ్డలు ఉన్నట్లుగా అనిపించడం.
రొమ్ములపై చర్మం ముడతపడడం, గట్టిగా మారడం.
నిపుల్స్ (చనుమొనల) నుంచి ఎరుపు లేదా తెలుపు రంగులో ద్రవం కారడం.
నిపుల్ షేప్ లేదా పొజిషన్ మారడం, ఆ ప్రాంతంలో చర్మం ఎర్రగా కమలడం.
For More News..