గాంధీయిజం.. ఓ ఇన్‌స్పిరేషన్.. నేడు గాంధీ 151వ జయంతి

గాంధీయిజం.. ఓ ఇన్‌స్పిరేషన్.. నేడు గాంధీ 151వ జయంతి

జాతిపిత మహాత్మా గాంధీ. స్వాతంత్ర్య పోరాటంలో దేశాన్ని ముందుండి నడిపించిన యోధుడు. శాంతి, అహింసా సిద్ధాంతాలను పాటించిన ఆయన జీవితం ఎంతో మందికి ఇన్​స్పిరేషన్. అప్పటి మార్టిన్​ లూథర్​కింగ్​ జూనియర్​తో మొదలుపెడితే ఇప్పటి దలైలామా వరకూ అందరిలో స్ఫూర్తి నింపింది ఆయనే. మహాత్ముడు నడిచిన మార్గం.. పాటించిన సూత్రాలు ఇప్పటి వారికీ అనుసరణీయమే. స్మార్ట్​ఫోన్లు, బయో టెక్నాలజీ, స్ట్రీమింగ్​ వీడియోలు, ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ వంటివి అందుబాటులోకి వచ్చి ప్రపంచం మొత్తం మారిపోయినా.. ఇప్పటికీ రోజువారీ జీవితంలో గాంధీ నుంచి పర్సనల్​గానో, ప్రొఫెషనల్​గానో.. చిన్నదో.. పెద్దదో ఏదో ఒకటి నేర్చుకునే వీలుంది. ఇవాళ అక్టోబర్​ 2. అంటే గాంధీ జయంతి. ఈ సందర్భంగా ఇప్పటి కార్పొరేట్​ వరల్డ్​కు
కూడా పనికి వచ్చే గాంధీ చెప్పిన.. పాటించిన సిద్ధాంతాలలో కొన్ని ఇప్పుడు చూద్దాం.

గుడ్డిగా పోటీపడేకన్నాపరస్పర సహకారం మేలు

ప్రస్తుత క్యాపిటలిస్టిక్​ వరల్డ్​లో షేర్​హోల్డర్లకు మించిన దైవం లేదనే విషయాన్ని కార్పొరేషన్లు గుర్తించడం మొదలైంది. షేర్​హోల్డర్స్​ క్యాపిటలిజం అనేది ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతున్న కాన్సెప్ట్. ముఖ్యంగా క్లైమెట్​ చేంజ్​ అనేది మానవాళి మనుగడకు ముప్పుగా మారిన తర్వాత ఇది మరింత పెరిగింది. క్యాపిటలిజం ద్వారా ప్రపంచానికి ఎదురయ్యే సవాళ్ల గురించి గాంధీకి ముందే తెలుసు. అందువల్లే ఆయన తీవ్రమైన పోటీకి బదులు.. పరస్పర సహకారం మేలైన విధానమని వాదించారు. ప్రస్తుతం కార్పొరేట్​ వరల్డ్ క్రమంగా పట్టుసాధిస్తున్నది ఇందులోనే.

లీడర్​షిప్

లీడర్​షిప్​కు గాంధీనే ఓ ఎగ్జాంపుల్. ఒక మత ఘర్షణను ఆపాలని భావిస్తే.. ఆయన నిరశన దీక్షకు దిగేవారు. తను నమ్మిన సిద్ధాంతాల కోసం అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడేవారు కాదు. సత్యాగ్రహం టైంలోనూ తన అనుచరులకు హాని కలిగించే పరిస్థితులను ఆయన కల్పించలేదు. ఇప్పటి నాయకులు గాంధీలాగే ఉండాల్సిన అవసరం లేదు కానీ.. ఇప్పటికీ కూడా తాము నమ్మిన సిద్ధాంతాలు, నమ్మకాలకు వారు కట్టుబడి ఉండాలి.

మేనేజ్​మెంట్

గాంధీ ఒక అల్టిమేట్​ ఆర్గనైజర్. ఆయన ప్రారంభించిన గొప్ప ఉద్యమాలన్నీ బ్రిటిష్​ సామ్రాజ్య పునాదులను కదిలించాయి. సహాయ నిరాకరణ, క్విట్​ఇండియా, ఉప్పు సత్యాగ్రహం ఇలాంటి ఉద్యమాలన్నీ బ్రిటిష్​ పాలకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇవన్నీ గాంధీ గొప్పతనానికి నిదర్శనాలే. సౌత్​ఆఫ్రికాలో ఒక యంగ్​ లాయర్​గా తన ఆర్గనైజేషనల్​ స్కిల్స్​ను గాంధీ మెరుగుపరుచుకున్నారు. తిరిగి ఇండియా వచ్చిన తర్వాత వాటి ద్వారా ఎక్కువ అడ్వాంటేజ్​ సాధించారు. సంక్లిష్టమైన జన సమూహాలను, వ్యవస్థలను ఎలా నడిపించాలో ఎవరైనా తెలుసుకోవాలంటే గాంధేయన్​ మెథడ్స్​ను స్టడీ చేస్తే ఎంతో అద్భుతమైన రిజల్ట్స్​ను సాధించవచ్చు.

ఓపెన్​ మైండ్​తో ఉండాలె

ఓపెన్​ మైండ్​తో ఉండడం అంటే.. నిరంతరం నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండడం. కొన్ని సంస్థల్లో హెచ్​ఆర్​ మేనేజర్లు తమ ఎంప్లాయీస్​కు ఇదే విషయం చెపుతుంటారు. మరికొన్ని కంపెనీల్లో స్టాఫ్​ కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఉత్సాహంగా ఉంటారు. గాంధీ జీవితమే ఒక గొప్ప ప్రయోగం. ఇది మాట వరుసకు చెపుతున్న విషయం కాదు. ఇండియా నుంచి ఇంగ్లాండ్​ అక్కడి నుంచి ఆఫ్రికా మళ్లీ అక్కడి నుంచి తిరిగి ఇండియాకు వచ్చిన గాంధీ ఈ క్రమంలో తన సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమాల టెక్నిక్​లకు ఎన్నోమార్పులు చేసుకున్నారు. వాటిని రియల్​లైఫ్​లోనూ ఫాలో అయ్యారు. ఆయన ఇండిపెండెన్స్​ కోసం పోరాటం చేస్తున్నా కూడా ప్రపంచం నలుమూలలా ఉన్న గొప్ప వారి నుంచి నేర్చుకోవడం.. స్ఫూర్తిపొందడం మాత్రం మానలేదు. గాంధీ నిజమైన చదువు అనేది స్కూల్​ తర్వాతే మొదలైంది. ఇది మనందరం నేర్చుకోవాల్సిన పాఠం కూడా

హెల్త్, ఫిట్​నెస్

చూసేందుకు బక్కపలుచగా గాంధీ మనకు కనిపించినా ఆయనకు ఫిట్​నెస్​పై ఎంతో శ్రద్ధ. గాంధీ నడిచారు.. నడిచారు.. నడిచారు.. ఇప్పటి ఫిట్​నెస్​ గురులు చెప్పేమాట రోజూ 30 నిమిషాల పాటు ఎక్సర్​సైజ్​లు చేయమనే. కానీ, గాంధీ దానికి మించే చేశారు. ప్రస్తుత కార్పొరేట్​ వరల్డ్​లో ఉద్యోగుల ఫిజికల్​ ఫిట్​నెస్​ను కంపెనీలు సీరియస్​గా తీసుకుంటున్నాయి. కొన్ని కంపెనీలైతే ఆఫీసులోనే జిమ్స్, ఫిట్​నెస్​ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ఇక అవసరానికంటే మించి తినకపోవడం గాంధీ హ్యాబిట్. ఎక్కడికయినా సరే నడిచే వెళ్లడం ఆయనకు అలవాటు. ప్రస్తుతం చిన్న దూరాలకు కూడా కార్లు, బైక్​లు వాడుతున్న వారు.. ఆయన జీవితం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.

For More News..

‘ఎల్ఆర్ఎస్ చట్ట వ్యతిరేకం’

మనది మార్పును వ్యతిరేకించే దేశం.. అందుకే బిల్లులపై ఇంత గొడవ

8 శాతం మంది.. 60 శాతం మందికి కరోనా అంటించిన్రు