Ajay Ghosh: ఇదిగో నా నెంబర్.. ఫోన్ చేసి బూతులు తిట్టండి.. నటుడు అజయ్ ఘోష్ షాకింగ్ కామెంట్స్

Ajay Ghosh: ఇదిగో నా నెంబర్.. ఫోన్ చేసి బూతులు తిట్టండి.. నటుడు అజయ్ ఘోష్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ నటుడు అజయ్ ఘోష్(Ajay Ghosh) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓపెన్ స్టేజిపై తన పర్సనల్ నెంబర్ చెప్పి కాల్ చేసి తిట్టామని చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి(Music shope murthy). కొత్త దర్శకుడు శివ పాలడుగు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చాందిని చౌదరి, ఆమని కీ రోల్స్ చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మ్యూజిక్ షాప్ మూర్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో భాగంగా నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. మ్యూజిక్ షాప్ మూర్తి ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది. వయసు పైబడ్డ ఒక వ్యక్తి డీజే ప్లేయర్ కావాలని ఆశ పడతాడు. ఆ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది ఈ సినిమా. ఓపక్క నవ్విస్తూనే ఎమోషనల్ గా సాగుతుంది. అందుకే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఒక వేళ నచ్చకపోతే నాకు ఫోన్ చేసి బూతులు తిట్టండి. అంటూ.. లైవ్ లో తన పర్సనల్ ఫోన్  నెంబర్ కూడా చెప్పేశాడు అజయ్ ఘోష్. 

దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ కూడా రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. గతంలో కూడా చాలా మంది ఇలాంటి కామెంట్స్ చేసి ట్రోల్ అయ్యారు. ఇవన్నీ మీకు అవసరమా అని కొంతమంది అంటుంటే. మరికొందరేమో.. తమ సినిమా మీద, తమ కంటెంట్ మీద ఆ టీమ్ కి ఉన్న నమ్మకం. మీ సినిమా ఖచ్చితంగా విజయం సాదిస్తుంది అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ జూన్ 14న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.