
రాజ రాజ చోర సినిమాతో హీరోయిన్ గా తనకంటూ మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న నటి సునైన. తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన ఓ పోస్టు ఆమె అభిమానులకు ఆందోళనకు గురిచేస్తుంది. చేతికి సెలైన్ పెట్టుకుని ఆస్పత్రి బెడ్‌పై దిగిన ఫొటోను సునైన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అయితే ఏ కారణంగా సునైన ఆస్పత్రి పాలైందో వెల్లడించలేదు. కానీ త్వరలోనే దృఢంగా తిరిగి వస్తానని చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన కొందరు నెటిజన్లు సునైన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
2005లో కుమార్ వెర్సస్ కుమారి సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సునైన. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళి బాషల్లో హీరోయిన్ గా నటించింది.
Give me some time… I will be back soon :) pic.twitter.com/WboqbO04sI
— Sunainaa Yeellaa (@TheSunainaa) October 20, 2023