ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్‌ కన్నుమూత

ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్‌ కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. గౌతం రాజు మృతి మరువక ముందే మరో సీనియర్ నిర్మాత కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్‌ (86)  ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్‌ మృతిపై పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

గోరంట్ల రాజేంద్రప్రసాద్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రముఖ నిర్మాత రామానాయుడుతో కలిసి గోరంట్ల రాజేంద్రప్రసాద్‌ పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘మాధవి పిక్చర్స్‌’ బ్యానర్ పై ఎన్నో మంచి సినిమాలకు నిర్మించారు. ‘దొరబాబు’, ‘సుపుత్రుడు’, ‘కురుక్షేత్రం’, ‘ఆటగాడు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇదే బ్యానర్‌ పై రూపొందాయి.