రజనీకాంత్ విలన్గా శర్వా.. బంపర్ ఆఫర్ కొట్టేసిన యంగ్ హీరో

రజనీకాంత్ విలన్గా శర్వా.. బంపర్ ఆఫర్ కొట్టేసిన యంగ్ హీరో

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ప్రస్తుతం జైలర్‌(Jailer) విజయాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తన్నారు. ఈ క్షణం కోసమే ఆయన అభిమానులు కూడా ఎంతో కాలంగా ఎదురుచూశారు. దీంతో రజని ఫ్యాన్ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన తరువాతి సినిమాపై కూడా చాల కేర్ తీసుకుంటున్నారు రజనీకాంత్. 

జైలర్ తరువాత రజనీకాంత్ జై భీమ్(Jai Bhim) దర్శకుడు టీజే జ్ఞానవేల్(TJ Gnanavel) తో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పేశారు. ఇప్పటికే కథా చర్చలు పూర్తయిన ఈ సినిమా  ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఇప్పటికే కంప్లీట్‌ అయిపోయాయి. అతిత్వరలో సెట్స్‌మీదకు కూడా వెళ్లనుంది ఈ ప్రాజెక్టు. సోషల్ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కనుంది.

అయితే ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో ఇక శర్వానంద్(Sharwanand) కీ రోల్ లో కనిపించనున్నాడట. ఈ పాత్రలో కాస్త నెగెటీవ్‌ షేడ్స్‌ ఉంటాయని తెలుస్తుంది. ఈ పాత్ర సినిమాకె హైలెట్ కానుందని సమాచారం. అందుకే శర్వానంద్ ను చూస్ చేసుకున్నారట మేకర్స్. ఈ పాత్ర గురించి శర్వాకు చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నాడట. పాత్ర బాగుంది, అందులోనూ రజనికాంత్ సినిమా.. ఇలాంటి ఆఫర్ వస్తే ఎవరు వదులుకుంటారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కా మారింది. 

అయితే ఈ పాత్ర కోసం ముందుగా నేచురల్ స్టార్ నానిని అనుకున్నారట మేకర్స్. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నాని ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఆ ఛాన్స్ ను ఇప్పుడు శర్వానంద్ కొట్టేశారు.