రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్!

రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్!

ఇన్‌స్టాగ్రామ్ లో ఎక్కువమంది ఫాలో అవుతున్న సౌత్ ఇండియన్ నటి రష్మిక మందన్న పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎప్పుడూ తన ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. అయితే..తాజాగా రష్మిక మందన్న ఫాన్స్ తన  ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయినట్లు గుర్తించారు. ఇన్‌స్టా బయోలో రష్మిక పేరును రివర్స్ ఆర్డర్లో రాసి ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అయితే.. ఈ విషయంపై స్పందించిన రష్మిక ఫ్యాన్స్ ఆందోళన చెందక్కర్లేదని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. తన అకౌంట్ ఏమీ హ్యాక్ అవ్వలేదని ఒక సోషల్ కాజ్ కోసం తన బయోలో పేరు మార్చినట్లు తెలిపింది. దీనికి కారణం వివరిస్తూ.. దేశంలో బాలిక విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ప్లం ప్రాజెక్ట్ బ్లాక్ బోర్డ్ అనే ప్రచారంలో పాల్గొంటున్నట్టు, దానికి మద్దతుగానే ఇన్‌స్టా బయోలో పేరు మార్చినట్లు వెల్లడించింది. దాన్ని వివరిస్తూ ‘మీరంతా చదువుకున్నారు కాబట్టి నా పేరు రివర్స్ లో రాసి ఉందని మీకు తెలిసింది. అదే చదువులేనివాళ్ల పరిస్థితి ఏంటి..? వాళ్లకు ఇవన్నీ ఎలా అర్థం అవుతాయి..? అందుకే ప్రతీ ఆడపిల్ల చదువుకోవాలి’ అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.