రూ.10 కి పడిపోయిన టమాటా.. రోడ్లపై పారబోస్తున్న రైతులు

రూ.10 కి పడిపోయిన టమాటా.. రోడ్లపై పారబోస్తున్న రైతులు

టమాటా ధరలు పాతాళానికి పడిపోతున్నాయి. రెండు నెలలుగా ఏడిపించిన టమాటా ధరలు నేల చూపులు చూస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జులై లో కిలో టమాటా రూ.200 లకు పైనే పలికి ఆల్​టైం రికార్డు సెట్​చేసింది. 

మార్కెట్లోకి దిగుబడి ఇబ్బడిముబ్బడిగా వస్తుండటంతో వాటి రేట్​ఒక్కసారిగి పడిపోయింది. ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ అగ్రికల్చర్​ మార్కెట్​లో ఆగస్టు 26న కిలో టమాటా రూ.10 పలికింది. వేలంలో క్వింటాల్​ టమాటా ధర రూ.వెయి కంటే తక్కువకే పలకడంతో.. కిలో రూ.10 లెక్కనే పడిందన్నమాట.  

కనీసం గిట్టుబాటు కూడా కాకపోతుండటంతో రైతులు రోడ్లపై పారబోస్తున్నారు.  టమాటా ధరలు మొన్నటి వరకు కొనుగోలుదారుల్ని ఏడిపించగా.. ఇప్పుడు రైతుల వంతు వచ్చింది.