మహిళలకు గుడ్ న్యూస్..ఆ రోజు ప్రత్యేక సెలవు

మహిళలకు గుడ్ న్యూస్..ఆ రోజు ప్రత్యేక సెలవు

మనిషి చేసే ప్రతీ పనిలో మహిళ తోడుంటుంది. ఉదయం నిద్రలేచిన దగ్గరనుంచి అమ్మగా.. కాలేజీల్లో ఫ్రెండ్ గా.. ఆఫీసుల్లో వెల్ విషర్ గా పక్కనే ఉంటుంది. ప్రతీ అడుగులో తోడుంటుంది. మన మంచిని కోరుకుంటుంది. తన కోరికల్ని పక్కనబెట్టి ఇళ్లు అనే బండిని నడిపిస్తుంది. అలాంటి అమ్మను పూజించేందుకు ప్రతీ సంవత్సరం మార్చి 8వ తేదీని మహిళా దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మహిళల ప్రత్యేకతను చాటేందుకు.. మహిళా దినోత్సవాన్ని సెలవు దినంగా ప్రకటించింది. ఆ రోజును పండుగగా జరపాలని ప్రతీ ఒక్కరికి సూచించింది.

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రం ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 8వ తేదీన మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తాజా ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవ సెలవు వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలందరికి కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. ఉత్తర్వుల్లో భాగంగా మహిళా ఉద్యోగులందరికీ తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.