కరోనా కొత్త లక్షణాలు.. నాలుక తడి ఆరడం, తెల్లమచ్చలు 

కరోనా కొత్త లక్షణాలు.. నాలుక తడి ఆరడం, తెల్లమచ్చలు 

ఇప్పటివరకు దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, రుచి, వాసన తెలియక పోవడం, శ్వాసలో ఇబ్బంది వంటి సింప్టమ్స్ కరోనా సోకినవారిలో కామన్​గా కన్పించేవి. ఇప్పుడు నాలుక తడి ఆరిపోవడం, నాలుకపై తెల్ల మచ్చలు రావడం వంటి కొత్త సింప్టమ్స్ కన్పిస్తున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. 

న్యూఢిల్లీ: కరోనా సోకినవారికి ఇప్పటివరకు దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, రుచి, వాసన తెలియకపోవడం, శ్వాసలో ఇబ్బంది వంటి సింప్టమ్స్ కామన్ గా కనిపించేవి. ఇప్పుడు డ్రై మౌత్, డ్రై టంగ్ (కొవిడ్ టంగ్) అనే రెండు కొత్త సింప్టమ్స్ ఎక్కువగా కన్పిస్తున్నాయని నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నిపుణులు చెప్తున్నారు. నోట్లో లాలాజలం ఊరకపోవడం వల్ల డ్రై మౌత్ సమస్య వస్తుంది. ఇలాంటి వాళ్లకు తిండి తినడం కూడా కష్టమవుతుంది. నాలుక తడారిపోవడంతో పాటు తెల్లగా మారడం, నాలుకపై తెల్లటి మచ్చలు ఏర్పడి కొవిడ్ టంగ్ సమస్య వస్తుంది. ఈ రెండు సింప్టమ్స్ తర్వాత నాలుగైదు రోజులకు ఫీవర్, గొంతు నొప్పి వంటి సీరియస్ సింప్టమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నదనేందుకు ఈ సింప్టమ్స్ సంకేతాలని, వీటిని నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొలిదశలోనే ఈ సింప్టమ్స్ ను గుర్తించి, డాక్టర్ల దగ్గరికి వెళితే పేషెంట్ ను కాపాడటం ఈజీ అవుతుందని, వైరస్ వ్యాప్తిని కూడా అడ్డుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే కొత్త సింప్టమ్స్‌‌ కొత్త వేరియంట్ కారణంగానే వస్తున్నయా? లేక పాత వేరియంట్ వల్లనే వస్తున్నయా? అన్నది ఇంకా కన్ఫామ్ కాలేదని పేర్కొంటున్నారు.