పక్క ఊరిలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారని టోప్యతండా గిరిజనుల ఫైర్​

పక్క ఊరిలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారని టోప్యతండా గిరిజనుల ఫైర్​
  • మెదక్​ జిల్లా చిలప్ చెడ్ తహసీల్దార్​ఆఫీసు ఎదుట నిరసన   

మెదక్ (చిలప్ చెడ్), వెలుగు : తమ పోలింగ్​బూత్​ మార్చాలని మెదక్​ జిల్లా చిలప్ చెడ్ మండలం టోప్య తండా గిరిజనులు  డిమాండ్​ చేశారు. తండాలో 400 ఓట్లుండగా అక్కడే పోలింగ్ బూత్  ఏర్పాటు చేయకుండా కిలోమీటర్​ దూరంలోని గౌతాపూర్ కు మార్చడంతో ఓటు వేసేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు.

బుధవారం సర్పంచ్ హనీభాయ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేశ్ నాయక్, బీజేపీ జిల్లా ఎస్టీమోర్చా ఉపాధ్యక్షుడు కిషన్ నాయక్ ఆధ్వర్యంలో తండా వాసులు, యువకులు తహసీల్దార్​ఆఫీస్​కు వచ్చి నిరసన తెలిపారు. సీ విజిల్​టీం, ఎంపీడీవో, తహసీల్దార్ అక్కడికి వచ్చి గిరిజనులతో చర్చించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ముసాదిక్ మాట్లాడుతూ పోలింగ్ బూత్ మార్చాలని తండా వాసులు కోరారని, విషయాన్ని జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్, నర్సాపూర్ ​సెగ్మెంట్ ​రిటర్నింగ్ ఆఫీసర్​దృష్టికి తీసుకువెళ్తామన్నారు.