కొత్త కొత్త ప‌ద్ద‌తులు.. పెళ్లి విందులో ఓన్లీ పిజ్జా, బ‌ర్గ‌ర్లు..

కొత్త కొత్త ప‌ద్ద‌తులు.. పెళ్లి విందులో ఓన్లీ పిజ్జా, బ‌ర్గ‌ర్లు..

పెళ్లి అంటే అక్షింతలు, మంత్రాలు, డ్యాన్సులు, నవ్వులు, ఆనందాలు మాత్రమే కాదు.. ఫుడ్ కూడా. అవును. పెళ్లికి వచ్చిన చాలా మంది అతిథులు లేదా స్నేహితులు వేడుకలో వడ్డించే ఆహారంపై కూడా ఫోకస్ చేస్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఈ వంటకాల్లో నాన్ వెజ్, వెజ్ ఐటెమ్స్ తో పాటు ఇతర స్నాక్స్ కూడా ఉండడం చూస్తూనే ఉంటాం. అందులో భాగంగా టొరంటోలోని ఓ కుటుంబం సాంప్రదాయేతర అలవాటును కాకుండా మెక్ డోనాల్డ్స్ అందించే స్పెషల్ ఫుడ్ ను మెనూలో చేర్చింది.

ఇజ్జీ బారెటో, ఆమె బాయ్ ఫ్రెండ్ జస్టిన్ అక్టోబర్ 15, 2022న వివాహం చేసుకున్నారు. వారి పెళ్లిలో సంప్రదాయ క్యాటరింగ్ కాకుండా.. మెక్ డోనాల్డ్స్ అందించే రూ.60వేల విలువ గల ఫుడ్ ను ఆర్డర్ చేశారు. ఈ ఫుడ్ ఐటెమ్స్ లో డబుల్ చీజ్ బర్గ్ లు, 100 చికెన్ ముక్కలు ఉన్నాయి. 150పోర్షన్ ల ప్రైస్ ను ఆర్డర్ చేయడానికి వీరు ఉబర్ ఈట్స్ ను ఉపయోగించారు. ఈ విషయంపై స్పందిచిన బారెటో.. మెక్ డోనాల్డ్స్ ఫుడ్స్ ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరని తెలిపారు. అంతే కాదు ఈ ఆహారంలో కొంత భాగాన్ని అతిథుల్ని తమ ఇంటికి కూడా తీసుకువెళ్లొచ్చని కూడా చెప్పారు.

చాలా మంది వారి అతిథులు లేదా కుటుంబం వంటి ఇతర వ్యక్తులను సంతోషపెట్టడానికి సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారని, కానీ ఇది మీ పెళ్లి రోజు.. కాబట్టి మీకు సంతోషాన్నిచ్చేది చేయండంటూ బారెటో చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పోస్టుపై.. చాలా మంది సానుకూల కామెంట్స్ చేశారు.