
10 గంటల్లో 10 సెంటీమీటర్ల వర్షం..
స్తంభించిన జనజీవనం
ముంబై: కుండపోత వానతో ముంబై సిటీ తడిసిపోయింది. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్ర 6 గంటల వరకు భారీ వర్షం కురిసింది. 10 గంటల్లోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. లోకల్ ట్రెయిన్ సర్వీసులను రద్దు చేశారు. అలాగే ముంబైకు వెళ్లాల్సిన విమనాలను దగ్గర్లోని ఎయిర్ పోర్టుకు దారి మళ్లించారు.
దాదర్–మాతుంగ స్టేషన్ల మధ్య ట్రాక్ లపై నీరు చేరడంతో ఆ మార్గంలో నడిచే రైళ్లు కూడా ఆగిపోయాయి. సిటీ బస్సు సేవలు కూడా వర్షానికి ప్రభావితమయ్యాయి. సెంట్రల్ ముంబైలోని వాడాల, మాతుంగ ఏరియాలో వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. నవీ ముంబైలోని బేలాపూర్ నోడ్ లో కొండపై వెళ్లిన 60 మంది టూరిస్టులు వర్షానికి చిక్కుకుపోగా.. రెస్క్యూ బృందాలు కాపాడాయి. ఇన నవీ ముంబైలోనూ 5 గంటల్లోనే 8.33 సెంటీమీటర్ల వర్షం కురిసింది.