యూపీలో బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న ప్రతిపక్షాలు

యూపీలో బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న ప్రతిపక్షాలు
  • ఒక్కసారి కూడా గెలవని ఎస్పీ, బీఎస్పీ
  • ఇప్పుడు కూటమిగా బరిలోకి
  • యూపీలో మెజారిటీ స్థానాలు గెలిచేలా వ్యూహం

ప్రధానిని డిసైడ్ చేసే సత్తా ఉన్న స్టేట్ ఉత్తరప్రదేశ్. దేశంలోనే ఎక్కువ లోక్​సభ నియోజకవర్గాలు ఉన్న రాష్ర్టమిది. గత ఎన్నికల్లో బీజేపీ విజయంలోముఖ్య పాత్ర పోషించింది. ఇక్కడ మొత్తం 80 స్థానాలుంటే, బీజేపీ 71 స్థానాల్లో గెలిచి కేంద్రంలో అధికారంలో కూర్చుంది. ఇప్పడు ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది. గతంతో పోలిస్తే బలపడిన కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. మొన్నటివరకు బద్ధ శత్రువులుగా ఉన్న సమాజ్ వాద్ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మెజారిటీ సీట్లు గెలవాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే యూపీలోని 10స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీ గత 20 ఏళ్లలో ఒక్కసారి కూడా గెలవలేదు. యూపీ రాజధాని లక్నోతోపాటు వారణాసి, అమేథీ, రాయ్ బరేలి, బాఘ్ పట్,బరేలీ , పిలిభిత్, కాన్పూర్ , మథుర, హత్రాస్ లో విజయం కళ్లజూడలేదు.

ఆరు సీట్లలో ఎస్పీ పోటీ

అమేథీ, రాయిబరేలీ స్థానాల్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ కూటమి పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో పెట్టలేదు.బాఘ్ పట్, మథుర సీట్లలో మిత్ర పక్షం ఆర్ఎల్ డీ పోటీ చేస్తోంది. ఇక మిగిలిన ఆరు చోట్ల ఎస్పీ పోటీ చేస్తోంది.

లక్నో: ఇక్కడ ఎవరిని బరిలో నిలపాలనే విషయంలో చర్చలు కొలిక్కి రాలేదు. లక్నోలో బీజేపీ బలంగా ఉంది.1998,1999, 2004లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్, 2009లో లాల్జీ టాండన్,2014లో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ గెలిచారు.

వారణాసి: 1999లో బీజేపీ నేత శంకర్ ప్రసాద్ జైస్వాల్,2004లో కాం గ్రెస్ నుం చి రాజేశ్ కుమార్ ​మిశ్రా, 2009లోమురళీ మనోహర్ జోషి, గత ఎన్నికల్లో నరేంద్రమోడీ గెలిచారు. ఇప్పుడు ఇదే స్థానం నుంచి ప్రధాని హోదాలో పోటీ చేస్తున్నారు. ఎస్పీఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

బరేలీ: కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ఇక్కడ 1999 నుంచి గెలుస్తూ ఉన్నారు.2009లో ఒక్కసారి ఓడిపోయారు.గంగ్వార్​కు పోటీగా ఎస్పీ నుం చి భాగవత్ శరణ్ గంగ్వార్ పోటీ చేస్తున్నా రు. ఈయన గత అఖిలేశ్ ప్రభుత్వం లో మంత్రిగా పని చేశారు.

కాన్పూర్: ఇక్కడ కూడా లక్నో లాంటి పరిస్థితే ఉంది.1999–2009వరకు కాం గ్రెస్ నేత సాయి ప్రకాశ్ జైస్వాల్, 2014లో మురళీ మనోహర్ జోషి గెలిచారు. బీజేపీ నుంచి సత్యదేవ్ పచౌరి,కాం గ్రెస్ నుంచి జైస్వాల్, ఎస్పీ నుంచి రామ్​కుమార్ పోటీ చేస్తున్నారు.

పిలిభిత్: 1999 నుంచి బీజేపీ అధీనంలోనే ఉంది.1999, 2004,2014 ఎన్నికల్లో మేనకాగాంధీ గెలవగా, 2009 ఎన్నికల్లో ఆమె కొడుకు వరుణ్ గాం ధీ గెలిచారు. ఇప్పుడు కూడా వరుణ్ పోటీలో నిలిచారు. ఎస్పీ నుంచి హేమ్ రాజ్ వర్మ బరిలో నిలిచారు.

హత్రాస్: 2009లోమినహా 1991నుం చి 2014వరకు బీజేపీగెలిచిం ది.2009లో ఆర్ఎల్డీగెలిచారు. రాజీవ్ సింగ్ బాల్మీకి ఇప్పుడుపోటీలో ఉన్నారు. ఎస్పీ నుం చి రామ్​జీ లాల్సుమన్ బరిలో నిలిచారు.