
- టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రమేశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : కార్యకర్తలకు ప్రభుత్వం ఎల్లపుడూ అండగా ఉంటుందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత కట్టెకోల శ్రీమన్నారాయణ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌తో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పటేల్ రమేశ్ రెడ్డి గురువారం ఆస్పత్రికి వెళ్లి శ్రీమన్నారాయణను పరామర్శించి వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులకు రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
అనంతరం చివ్వెంల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల పాఠశాలను ఆయన సందర్శించారు. డ్యూయల్ డెస్క్ బెంచ్‌లు, కంప్యూటర్ ల్యాబ్, వాటర్ పైప్ లైన్, ఇతర పనుల కోసం ఎస్టిమేషన్ అందిస్తే త్వరలో ఫండ్స్ విడుదల చేస్తామని తెలిపారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు రమేశ్ నాయుడు, వల్దాస్ దేవేందర్ తదితరులు ఉన్నారు.