టెక్నాలజీ సాయంతో టూర్లు

టెక్నాలజీ సాయంతో టూర్లు

నచ్చిన ఫుడ్​ ఆర్డర్​ చేయడం నుంచి ట్రాఫిక్​ ఎక్కడ ఎక్కువ ఉంది? ఏ టూరిస్ట్​ ప్లేస్​ సేఫ్​? వంటివి తెలుసుకోవడం... ఇలా ప్రతిదీ యాప్స్​ సాయంతో ఈజీ అయింది ఇప్పుడు. అంతేకాదు ఎక్కడికైనా టూర్​ ప్లాన్​ చేసే ముందు అక్కడి వాతావరణం, ఫెసిలిటీస్​ తెలుసుకునేందుకు టెక్నాలజీ మీద ఆధారపడుతున్నారట చాలామంది. టూర్​ ప్లాన్​ కోసం దాదాపు75 శాతానికి పైగా ఇండియన్​ టూరిస్ట్​లు  టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారట. సేఫ్​ అయిన దేశాలకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అంటోంది ‘బుకింగ్​.కామ్​’ అనే ట్రావెల్​ సంస్థ. 

ఈ ఏడాది చేయాలనుకునే ట్రిప్స్​కోసం ట్రావెలర్స్​ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయంపై ‘ట్రావెల్ ప్రిడిక్షన్స్​ 2022 రీసెర్చ్’​ రిపోర్టు రిలీజ్​ చేసింది ఈ సంస్థ. ఈ రిపోర్టులోని ఇంట్రెస్టింగ్​ విషయాలివి... టికెట్స్​ బుక్​ చేయడం నుంచి ట్రిప్​ ప్లాన్స్​ సెలక్ట్​ చేసుకోవడం వరకు అన్నింటికి టెక్నాలజీ వాడుతున్నారు టూరిస్టులు. కొత్త ప్లేస్​లకి వెళ్లే ముందు ఉండే యాగ్జైంటీని ట్రావెల్​ సైట్స్​, యాప్​లు  తగ్గిస్తున్నాయని చెప్తున్నారు 76 శాతం మంది భారతీయులు. ట్రావెలింగ్​లో వస్తోన్న కొత్త  టెక్నాలజీలని 72 శాతం మంది ఓ కంట గమనిస్తున్నారట. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ సాయంతో పనిచేసే ఇన్​స్టంట్​ ట్రాన్స్​లేషన్​ సర్వీస్​లు ట్రావెలర్స్​కి చాలా హెల్ప్​ చేస్తున్నాయి.  వీటి ద్వారా చివరి నిమిషంలో ప్లాన్​ ఛేంజెస్​ గురించి​  బస చేయాలనుకున్న హోటల్, పికప్​ చేసుకోవడానికి కార్లని పంపించే సంస్థకి మెసేజ్​ వెళ్తుంది.  ఫ్లయిట్ ఆలస్యం కావడం వల్ల బీచ్​ కాటేజ్​కి లేట్​గా వస్తున్నామని చెప్పేయొచ్చు కూడా. ఏ దేశంలో టూరింగ్​ చాలా సేఫ్​?  అనేది  కొన్ని నెలల ముందుగానే చెప్పే టెక్నాలజీ కోసం టూరిస్టులు చూస్తున్నారు. అంతేకాదు ఆయా దేశాల్లో కరోనా సిచ్యుయేషన్​ బట్టి  ఏ ప్లేస్​లకి తొందరగా వెళ్లొచ్చు? అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారు.

అంతా టెక్నాలజీతో...
‘‘కరోనా వల్ల గత రెండేండ్లలో ట్రావెలింగ్​లో చాలా మార్పులు వచ్చాయి. ట్రావెలర్స్​ ఆలోచనలో కూడా ఛేంజ్​ వచ్చింది. టెక్నాలజీ సాయంతో ట్రావెలింగ్​కు సరైన టైమ్ తెలుసుకుంటున్నారు. టూర్​ ప్లాన్​ చేసుకునే ముందు చాలామంది టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. ట్రావెలర్స్​కి ఏ విధమైన సాయం చేయడానికైనా మేం 
రెడీగా ఉన్నాం” అంటున్నారు ‘బుకింగ్​.కామ్’​  సౌత్​ ఏషియా రీజినల్​ మేనేజర్​ రితూ మెహ్రొత్రా.