హైదరాబాద్, వెలుగు: రియల్టీ సంస్థ స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ తెలంగాణలోని యాదగిరి గుట్ట వద్ద 110 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయడానికి రూ. 300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రూ. 1,100 కోట్ల ఆదాయం వస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది.
మొత్తం 110 ఎకరాల్లో, 90 ఎకరాల్లో రెసిడెన్షియల్ ప్లాట్లను (రూ. 500 కోట్ల ఆదాయం) అందిస్తారు. మిగిలిన 20 ఎకరాల్లో 333 సొంత ఇండ్లతో సీనియర్ లివింగ్ ప్రాజెక్ట్ (రూ. 600 కోట్ల ఆదాయం) నిర్మిస్తారు. యాదగిరి గుట్టలో ఆధ్యాత్మిక వాతావరణం వల్ల ఇటువంటి ఇండ్లకు డిమాండ్ పెరుగుతోందని స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ ఎండీ, సీఈఓ కీర్తి చిలుకూరి తెలిపారు.
