బీసీ బాంధవుడు సీఎం రేవంత్ : నూక కిరణ్ యాదవ్

బీసీ బాంధవుడు సీఎం  రేవంత్ : నూక కిరణ్ యాదవ్

నకిరేకల్, వెలుగు : బీసీ బాంధవుడు సీఎం  రేవంత్ అని టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్ యాదవ్ అన్నారు. హైదరాబాద్​లోని ఆయన ఇంట్లో సీఎం రేవంత్​రెడ్డిని సోమవారం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్,  మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,  బీసీ సంఘాల నాయకులతోపాటు ఆయన కలిశారు.

 ఈ సందర్భంగా సీఎంను సన్మానించారు. ఈ సందర్భంగా కిరణ్​యాదవ్​మాట్లాడుతూ బీసీ కులగణనను 100 శాతం డిజిటలైజేషన్ చేసిన ఘనత కాంగ్రెస్​ ప్రభుత్వానిదేన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సీఎం రేవంత్​రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.